దేవుడా.. పవన్ షూల కోసమే అంత ఖర్చు చేశారా.. ఆ షూస్ ఖరీదెంతంటే?

సాధారణంగా ఏ స్టార్ హీరోకు అయినా అభిమానులు ఉంటారు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) మాత్రం భక్తులు ఉంటారు.

 Pawan Kalyan Bro Movie Latest Poster Details, Pawan Kalyan ,saitej, Bro Movie, P-TeluguStop.com

పవన్ ఏం చేసినా అభిమానులకు నచ్చుతుంది.యూత్ లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్ కు పేరుంది.

పవన్, సాయితేజ్ కాంబో మూవీకి బ్రో ( Bro Movie ) అనే టైటిల్ వినిపించిన సమయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా తర్వాత రోజుల్లో ఈ టైటిల్ బాగుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా విడుదలైన పోస్టర్ లో పవన్ షూస్( Pawan Kalyan Shoes ) హాట్ టాపిక్ అయ్యాయి.

ఒక షూ బ్లాక్ కలర్ లో ఉండగా మరో షూ వైట్ కలర్ లో ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.అయితే స్టైల్ కోసమే పవన్ అలాంటి షూస్ వేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

బ్రో సినిమా కోసం బాల్మేన్ కంపెనీకి చెందిన మూడు జతల షూలను పవన్ కోసం ప్రత్యేకంగా తెప్పించారని సమాచారం.

ఒక్కో జత ఖరీదు లక్ష రూపాయలు అని మూడు జతల కోసం ఏకంగా మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారని బోగట్టా.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం.ఈ బ్యానర్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువేననే సంగతి తెలిసిందే.

జులై నెల 28వ తేదీన బ్రో సినిమా రిలీజ్ కానుండగా సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

బ్రో మూవీ కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పవన్ సాయితేజ్ లకు( Pawan Saitej ) ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.రాబోయే రోజుల్లో కూడా పవన్ సాయితేజ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సినిమా సినిమాకు పవన్ పారితోషికం పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube