ప్రస్తుతం ఏపీ తెలంగాణ నేతలు వరుస వరుసగా ఢిల్లీ బాట పడుతున్నారు.ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు.
అలాగే నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఢిల్లీ బాట పట్టారు.ఇక ఏపీ సీఎం జగన్ సైతం మరికొద్ది రోజుల్లో ఢిల్లీ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ, ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీకి వెళ్లారు.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు పవన్ ఢిల్లీ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి తో పవన్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.ఇక ఆ తరువాత బిజెపి పెద్దలను కలవబోతుండడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఏపీలో జనసేన రోడ్ల ఉద్యమం చేపట్టింది.దీనికి విశేషమైన స్పందన రావడంతో పాటు, చివరకు ఏపీ సీఎం జగన్ సైతం స్పందించి రోడ్ల మరమ్మతు విషయమై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వర్షాలు తగ్గిన తర్వాత ఏపీ వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ విధంగా జనసేన మైలేజ్ బాగా పెరగడంతో పాటు, సొంతంగా ఏపీలో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం తదితర అంశాలపై కేంద్ర బిజెపి పెద్దలు ఆరాధిస్తున్నారు.2024 నాటికి బిజెపి గెలుపు పై అనేక అనుమానాలు ఉండటంతో దేశవ్యాప్తంగా తమకు అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే పవన్ ను ఢిల్లీ కి పిలిపించడం పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఏపీలో బీజేపీ జనసేన ఎవరికి వారే అన్నట్లుగా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వం పై పొరాడేందుకు ప్రయత్నాలు చేయకపోవడం, బిజెపితో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో పవన్ ఉండడం ఇవన్నీ ఎప్పటికప్పుడు బిజెపి కేంద్రం పెద్దలకు చేరడంతోనే పవన్ డిల్లీకి పిలిపించారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరి పవన్ బీజేపీ పెద్దలతో ఏ అంశాలపై చర్చిస్తారు ? ఏవైనా కొత్త డిమాండ్లను వినిపిస్తారా అనేది తేలాల్సి ఉంది.