మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) థియేటర్లలో హిట్ గా నిలిచి ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopalakrishna ) స్పందిస్తూ మహేష్ బాబు( Mahesh Babu ) స్టాండర్డ్ లో ఈ సినిమా లేదని నా అభిప్రాయం అని కామెంట్లు చేశారు.
గుంటూరు కారం ఎంత మంటెత్తించేలా ఉంటుందో ఇతని పాత్ర అలా ఉందని టైటిల్ ఫిక్స్ చేసి ఉండవచ్చని ఆయన తెలిపారు.
త్రివిక్రమ్( Trivikram ) సినిమాలలో ఈ సినిమా కొంత తేడాగా అనిపించిందని పరుచూరి పేర్కొన్నారు.
చిన్న పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కిందని సంతకం గురించి ప్రధానంగా సీన్లు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.మహేష్ రమ్యకృష్ణ కాంబో సీన్లు పవర్ ఫుల్ గా ఉంటాయని ఆశించగా అలా జరగలేదని పరుచూరి వెల్లడించారు.
మహేష్ లాంటి హీరోకు సరిపడా లైన్ రాలేదని ఆయన కామెంట్లు చేశారు.
తల్లీకొడుకుల సెంటిమెంట్ ఈ సినిమాలో పండలేదని తాతాకొడుకుల సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో పండలేదని పరుచూరి పేర్కొన్నారు.ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ తప్పు అని ఆయన చెప్పుకొచ్చారు.ఫ్యామిలీ స్టోరీ( Family Story ) అని ఫీలయ్యేలా చేయలేదని పరుచూరి వెల్లడించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబో మూవీకి కలెక్షన్లు బాగానే వచ్చి ఉండవచ్చని హృదయానికి సంతృప్తి రాలేదని ఆయన అన్నారు.
ఈ సినిమాలో పాత్రలు ఎక్కువై గందరగోళానికి గురి చేశాయని పరుచూరి వెల్లడించారు.మాది గుంటూరు జిల్లా అని నేను కూడా గుంటూరు కారాన్ని అని పరుచూరి కామెంట్లు చేశారు.పెద్ద దర్శకులు కథల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పరుచూరి వెల్లడించడం గమనార్హం.
త్రివిక్రమ్ తర్వాత సినిమాలతో ప్రూవ్ చేసుకోవాలని ఆయన కామెంట్లు చేశారు.