హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( HMDA Former Director Shiva Balakrishna ) కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా బాలకృష్ణ బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
ఈ క్రమంలోనే శివబాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయని తెలుస్తోంది.నిన్న బినామీల పేరిట ఉన్న రూ.2.7 కోట్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. ఫేక్ ఐటీ రిటర్న్స్( Fake IT Returns ) ఫైల్ చేసినట్లు గుర్తించిన ఏసీబీ శివబాలకృష్ణ సతీమణి పేరుతో దేవి శారీసెంటర్ ఉన్నట్లు గుర్తించారు.
అలాగే సోదరుడి భార్య అరుణ పేరిట సౌందర్య బొటిక్, సౌందర్య రెడీమేడ్ డ్రెసెస్( Soundarya Readymade Dresses ) సంస్థలు ఉన్నాయని అధికారుల విచారణలో తేలింది.దాంతో పాటు శివబాలకృష్ణ సోదరుడు నవీన్ రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.బాలకృష్ణ కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ పేరుతో మరో ఫేక్ ఐటీ రిటర్న్స్ గుర్తించారు.