బాలీవుడ్ నటి పరిణితి చోప్రా(Parineeti chopra), ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadda) వివాహ వేడుకలు ప్రారంభం అయ్యాయి.వీరి వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈనెల 24వ తేదీ వీరి వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా ఉదయపూర్ చేరుకున్నట్టు తెలుస్తుంది.తాజాగా నేడు ఉదయం పరిణితి చోప్రా రాఘవ్ సైతం ఉదయపూర్ కు చేరుకున్నారు అక్కడికి వెళ్లినటువంటి ఈ జంట పెళ్లి ఏర్పాట్లన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఆదివారం రాఘవ్ చద్దా పరిణితి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు.అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది ఇప్పటికే విఐపి లకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని సమాచారం.ఆదివారం వీరి వివాహం కావడంతో శనివారం ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు కాబోతున్నాయి మెహంది సంగీత్ వంటి వేడుకలకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తుంది.
ఇక వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను రాఘవ్ పరిణితి పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే సమీప బంధువులందరూ కూడా ఉదయపూర్( Udaipur ) చేరుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఉదయపూర్ లో వీర వివాహం జరిగిన అనంతరం గురుగ్రామ్ లో వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగబోతుంది.ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.
ఇక రాఘవ్ రాజకీయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీగా కొనసాగుతూ ఉండగా పరిణితి చోప్రా బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక వీరు ఇద్దరు కూడా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.