పల్నాడు జిల్లా సతైనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మంత్రి అంబటి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అట్టడుగు వర్గాలకు అవకాశాలు కల్పించి, సామాజిక సమానత్వం వైపు నడిపిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నారు.2014లో సతైనపల్లి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల్లో ఓటమిపాలైనా మిమ్మల్ని నమ్ముకొని కష్టపడ్డానాని, అతర్వాత 2019 ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు.నియోజకవర్గాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు అంబటి.
మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.
దమ్మూ, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే.నిజంగా నీ ఒంట్లో రాయలసీమ రక్తం ఉంటే.2024లో టీడీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పు లోకేషాని.సవాల్ విసిరారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సింగిల్‌గానే పోటీ చేస్తుందని, సీఎం జగన్ దమ్మున్న నాయకుడని.ప్రజల మనసు గెలిచిన లీడర్ అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
లోకేష్ ది ఓ పిచ్చి మాలోకం పాదయాత్రని సెటైర్లు వేశారు.చంద్రబాబు,దత్తపుత్రుడు కలిసి వచ్చిన పీకేదేమి లేదని విమర్శలు గుప్పించారు.
దుష్ట చతుష్టయం పైనే మన పోరాటమని అనీల్ అన్నారు.స్వాతంత్ర్యానంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాధికార, నియామకాల్లో పదవుల్లోనూ సమాన ప్రాతిపదిక అవకాశము కల్పించిన ఘనత జగనదేనన్నారు.
హోల్ సేల్ గా అమ్ముడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు.