పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కష్టాలు వీడటం లేదు.జాతీయ రహస్యాల చట్టాన్ని అతిక్రమించిన కేసులో ఇమ్రాన్ ఖాన్( Imran Khan) ను ఇస్లామాబాద్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
అధికారంలో ఉన్న సమయంలో పదవిని దుర్వినియోగం చేస్తూ రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని మాజీ రాయబారి ద్వారా అమెరికా( America )కు పంపారని, కీలక డాక్యుమెంట్లు లీక్ అయ్యాయని ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ తో పాటు విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖురేషీ( Qureshi )కి పాక్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.అయితే 2018 ఆగస్ట్ నుంచి ఏప్రిల్ 2022 వరకు పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ పని చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆగస్ట్ 2023 నుంచి పలు ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నారు.