అబాబీల్ వెపన్ సిస్టమ్ ఫ్లైట్ టెస్ట్‌ సక్సెస్.. వెల్లడించిన పాక్ ఆర్మీ..

పాకిస్థాన్ భారతదేశ క్షిపణి రక్షణ వ్యవస్థను ఎదుర్కోవడానికి అబాబీల్( Ababeel ) అనే కొత్త బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది.అంతే కాదు తాజాగా దానిని విజయవంతంగా పరీక్షించింది.సైన్యం ప్రకారం, అబాబీల్ వెపన్ సిస్టమ్ పలు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.2,200 కి.మీ రేంజ్ దీనికి ఉంటుంది.

 Pakistan Successfully Conducts Flight Test Of Ababeel Weapon System Details, Pak-TeluguStop.com

వెపన్ సిస్టమ్( Ababeel Weapon System ) ఫ్లైట్ టెస్ట్‌ బుధవారం 2023, అక్టోబర్ 18 నాడు నిర్వహించారు.

వివిధ ఉప-వ్యవస్థల యొక్క వివిధ సాంకేతిక అంశాలు, పనితీరు కొలతలను వెరిఫై చేసేందుకు ఈ టెస్ట్ కండక్ట్ చేశారు.ఈ పరీక్షకు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (CJCSC) చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా, వ్యూహాత్మక సంస్థలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు హాజరయ్యారు.

Telugu Ababeelweapon, Nri, Pak, Pakistan, Pakistanababeel-Telugu NRI

ఈ క్షిపణి వ్యవస్థ పాకిస్థాన్( Pakistan ) పూర్తి స్పెక్ట్రమ్ డిటరెన్స్ పాలసీలో భాగమని, ఇది విశ్వసనీయమైన మినిమమ్‌ డిటరెన్స్ పోయ్‌చర్ నిర్వహించడానికి, రీజనల్ స్టెబిలిటీని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుందని సైన్యం తెలిపింది.బాలిస్టిక్ క్షిపణి( Ballistic Missile ) రక్షణ వ్యవస్థను భారత్ అభివృద్ధి చేయడం వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఈ క్షిపణి వ్యవస్థను పాకిస్థాన్‌ అభివృద్ధి చేసింది.భారత బాలిస్టిక్ క్షిపణి పాకిస్థాన్ అణ్వస్త్ర నిరోధక సామర్థ్యాన్ని దెబ్బతీయగలదని సైన్యం పేర్కొంది.కొత్త వెపన్ సిస్టమ్‌ తీసుకొస్తున్నామని వివరించారు.

Telugu Ababeelweapon, Nri, Pak, Pakistan, Pakistanababeel-Telugu NRI

అబాబీల్ వెపన్ సిస్టమ్ విజయవంతమైన పరీక్షపై వ్యూహాత్మక బలగాలను రాష్ట్రపతి, తాత్కాలిక ప్రధాన మంత్రి, సేవల అధిపతులు అభినందించారు.వారి సాంకేతిక నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతను ప్రశంసించారు.

ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థాన్ అభివృద్ధి చేసిన ఏకైక క్షిపణి వ్యవస్థ అబాబీల్ వెపన్ సిస్టమ్ మాత్రమే కాదు.2021లో, పాకిస్థాన్ ఫతా-1 గైడెడ్ మల్టీ-లాంచ్ రాకెట్ సిస్టమ్‌ను కూడా పరీక్షించింది, ఇది 140 కిమీ పరిధిని కలిగి ఉంది.ఇది అధిక కచ్చితత్వంతో సంప్రదాయ వార్‌హెడ్‌లను అందించగలదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube