సొరకాయ సాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడి కోసం మెళుకువలు..!

కూరగాయ సాగులో సొరకాయ సాగు( Zucchini Cultivation ) కూడా ఒకటి.సొరకాయ సాగుకు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ అవసరం.

 Ownership Of Fertilizers In Zucchini Cultivation Techniques For High Yield , Zuc-TeluguStop.com

కాబట్టి రైతులు సొర కాయ సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ సొరకాయ సాగు చేసే విధానంపై అవగాహన ఉంటే మంచి దిగుబడి పొందవచ్చు.

ఈ సాగును సాధారణ పద్ధతిలో నేలపై, లేదంటే పందిరి విధానంలో కూడా సాగు చేయవచ్చు.ఈ సాగుకు నీటి వసతులు ఉండే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు( Clay soils, sandy soils ), ఎర్ర నేలలు అనుకూలంగా ఉంటాయి.

నీరు నిల్వ ఉండే నేలలు ఈ సాగుకు అనుకూలంగా ఉండవు.

ఈ సొరకాయ సాగులో చీడపీడ బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది.కాబట్టి ముందుగా చీడపీడల బెడదను తట్టుకునే మేలు విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.మార్కెట్లో దొరికే పుసా మంజరి, పూస మేఘదుత్, పూసా సమ్మర్, ప్రోలిఫిక్ రౌండ్, కో 1 వంటి మేలురకం విత్తనాలను ఎంచుకుంటే చీడపీడల బెడద లేకుండా అధిక దిగుబడి పొందవచ్చు.

ఒక ఎకరానికి 1.75 కిలోల విత్తనాలు అవసరం.ఈ విత్తనాలను రెండు గ్రాముల కార్బండజిమ్( Carbonazim ) తో విత్తన శుద్ధి చేసుకోవాలి.లేదంటే నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడే( Trichoderma viridae ) తో విత్తన శుద్ధి చేసుకుంటే దాదాపుగా తెగుళ్ల బెడద ను నివారించినట్టే.

ఇక పూత, పిందే సమయంలో నీటి తడులు అందించాలి.ఇక ఎరువుల విషయానికి వస్తే ఎక్కువగా సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలి.వీటితోపాటు 30 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులు ఒక ఎకరం పొలానికి అవసరం.నత్రజనిని రెండు భాగాలుగా చేసుకుని మొదట విత్తిన నాలుగు వారాలకు వేసుకోవాలి.

రెండో మోతాదు పిందే దశలో ఉన్నప్పుడు వేసుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు.ఇక పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube