యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్ట్ ఉన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే ”సలార్”.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
ఎన్నో రోజుల ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించే సమయం ఆసన్నం అయ్యింది.ఈ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కు మరో నెల సమయం మాత్రమే ఉంది.
క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.
మరి ఈ రోజు నుండి ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉంది.
దీంతో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ నెల ముందు నుండే ఫ్యాన్స్ లో హంగామా స్టార్ట్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ ను ఇప్పటి నుండే వైరల్ చేసేస్తున్నారు.మరి ఇంకా నెల సమయమే ఉండడం luaతో ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి.ముందుగా ఫ్యాన్స్ అంత ఎదురు చూసే అప్డేట్ ట్రైలర్…
ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1 న రిలీజ్ చేయనున్నారు.కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.
మరి ఇదైనా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుందో లేదో చూడాలి.