వైరల్‌ : తన చేనులో దొంగలు పడ్డారని రైతు పోలీసులకు ఫిర్యాదు, ఏం పోయి ఉంటాయో తెలుసా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లి దరలు మండి పోతున్నాయి.సెంచరీ దాటి డబుల్‌ సెంచరీకి కోహ్లీ పరుగుల మాదిరిగా దూసుకు పోతుంది.

 Onion Crop Worth 50000 Stolen From Farmers Field In Madhya Pradesh Mandh Sour-TeluguStop.com

ఇలాంటి సమయంలో దేశ వ్యాప్తంగా ఉల్లి దొంగలు భారీగా పెరిగి పోతున్నారు.ఒకప్పుడు ఉల్లి గడ్డలు రోడ్డున పోసి ఉన్నా కూడా ఎవరు పట్టించుకునే వారు కాదు.

కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.ఇంట్లో ఉల్లి గడ్డలు చాలా ఉన్నాయంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది.

ఎవరైనా దొంగతనంకు వస్తారేమో అని ఆందోళన వ్యక్తం అవుతుంది.

Telugu India, Cropworth, Telugu General, Telugu-

ఉల్లి గడ్డలు రేట్లు ఎక్కువగా ఉండటంతో ఉల్లి రైతులకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది.ఉత్తర భారతదేశంలో ఉల్లి గడ్డలు ఎక్కువగా పండిస్తూ ఉంటారనే విషయం తెల్సిందే.తాజాగా మద్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ ప్రాంతంలో ఒక రైతు ఉల్లి గడ్డ పంటను వేశాడు.

వారం పది రోజుల్లో ఉల్లి గడ్డలను తోమేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సమయంలోనే కొందరు దొంగలు రైతు పొలంలో రాత్రికి రాత్రి పడి ఉల్లి గడ్డలు తోముకు పోయారట.

Telugu India, Cropworth, Telugu General, Telugu-

ఉదయం పొలంకు వెళ్లి చూసిన రైతు గుండె పగిలినంత పనైందట.సగం చేను తోముకు వెళ్లారని దాదాపుగా 50 వేల రూపాయల పంటను దొంగలు తోముకు పోయారంటూ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఎప్పుడు రేటు ఉండదు.ఈసారి మంచి రేటు ఉంది, తప్పకుండా మంచి లాభం వస్తుందనుకుంటే ఇలా జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.రైతు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.విచారణ నిమిత్తం పోలీసులు ఇప్పటికే కొందరు అనుమానితులను ప్రశ్నించారు.

త్వరలోనే దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామంటూ రైతుకు హామీ ఇచ్చాడు.అయితే ఆ రైతు మాత్రం త్వరగా దొంగలను పట్టుకుని తన ఉల్లి గడ్డలు తనకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube