ప్రపంచంలో ఎక్కువ మంది వాడే యాప్స్ లో మొదటి వరుసలో నిలబడే యాప్స్ లో వాట్సాప్ ఒకటి.వాట్సాప్ ను ఫేస్బుక్ సంస్థ కొనుగోలు చేసినప్పుడు నుంచి వారి యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం.
అయితే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని వాట్సాప్ వారి వినియోగదారుల కోసం తీసుకువచ్చింది.ఈ సరికొత్త ఫీచర్ ద్వారా మనం ఇతరులతో చాట్ చేస్తున్న సమయంలో ప్రతి చాట్ కోసం ఓ కొత్త వాల్ పేపర్ ను ఎంచుకొని ఈ సదుపాయాన్ని కల్పించింది వాట్సాప్.
ఇందుకు సంబంధించి వాట్సాప్ కొత్తగా వాల్ పేపర్ గ్యాలరీ ని అప్డేట్ చేసింది.వీటితో పాటు వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే స్టిక్కర్లు అలాగే ఎమోజి ల విషయంలో కూడా మరికొన్ని ఫీచర్స్ ను తీసుకు వచ్చినట్లు వాట్సాప్ తెలియజేసింది.
ఇందులో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ‘ టుగెదర్ అట్ హోమ్ ‘ అనే స్టిక్కర్ ప్యాక్ ను తాజాగా వాట్సాప్ తన యానిమేటెడ్ స్టిక్కర్లు గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించింది.ఈ అప్డేట్ లో భాగంగా వాల్ పేపర్ సంబంధించి ఫీచర్ లో ఏకంగా 32 బ్రైట్ వాల్ పేపర్స్, 30 డార్క్ వాల్ పేపర్స్ లోను అందించబోతున్నట్లు వాట్సాప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది.
మీరు వాట్సాప్ ఉపయోగించిన సమయంలో లైట్ లేదా డార్క్ మోడ్ సెట్టింగ్స్ ల కోసం ప్రత్యేక వాల్ పేపర్లను కూడా ఈ అప్ డేట్ ద్వారా ఎంచుకోవచ్చు.ఈ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఎప్పుడైతే డార్క్ మోడ్ లోకి మారుతుందో మీ చాట్ వాల్ పేపర్ అదంతట అదే మారిపోతుంది.
వీటితో పాటు డూడుల్ వాల్ పేపర్స్ ను మరిన్ని కొత్త అందుబాటులోకి తీసుకో వచ్చినట్లు వాట్సప్ తెలిపింది.ఇందుకు సంబంధించి యూజర్ తనకు నచ్చిన వాల్ పేపర్ ను ఎంచుకొని అందుకు తగ్గట్టుగా బ్రైట్ నెస్ లో మార్పులు చేసుకోవచ్చని తెలిపింది.
అయితే ఈ అప్డేట్ కేవలం కొంతమందికి మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాట్సాప్ తెలియజేసింది.అతి త్వరలో ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి తీసుకరాబోతున్నట్లు తెలియజేశారు.