టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి మనందరికీ తెలిసిందే.నవీన్ పొలిశెట్టి ( Naveen Policetty )పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా జాతి రత్నాలు.
ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాతో తెలుగులో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు హీరో నవీన్.
ఇది ఇలా ఉంటే చాలా కాలం తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి( Miss Shetty Mr.Polishetty ) సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు నవీన్ పొలిశెట్టి.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా నటించిన తెలిసిందే.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండడంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు నవీన్ పొలిశెట్టి.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.నేను క్యారెక్టర్ లోకి ఒకసారి దూరానంటే ఎవ్వర్నీ కలవను.
షూటింగ్ సమయంలో ఇంట్లో వాళ్లతో కూడా పెద్దగా మాట్లాడను.మీటింగ్స్, బయట పార్టీలు, ఫంక్షన్లు ఏవీ పెట్టుకోను.
నేను షూటింగ్ స్టార్ట్ చేశానంటే ఇంట్లో వాళ్లు, బంధువులు తిట్టుకుంటారు.ఫోన్ కూడా ఎత్తలేదని తిట్టుకుంటారు.
సినిమా షూటింగ్ సమయంలో పూర్తిగా ఆ సినీ ప్రపంచంలోనే ఉంటాను.నాకంటూ నేను కూడా ఏమీ చేసుకోను.అలా పూర్తిగా సినిమా లోకంలో ఉండడం వల్ల ఆడియన్స్ ను కలవడం కోసం ప్రచార కార్యక్రమాల్ని ఉపయోగించుకుంటాను అని తెలిపారు నవీన్.సినిమా ప్రచారం కంటే, ప్రేక్షకుల్ని కలుస్తున్నాననే ఎక్సయిట్ మెంట్ తనలో ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాడు.
కాగా నవీన్ పొలిశెట్టి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.