ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న ప్రజలు ప్రతి పండుగను ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటారు.అలాగే మన దేశంలోని ప్రజలు చాలా రకాల సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటారు.
ఈ నెల 18వ తేదీన జరుపుకునే వినాయక చవితి( Vinayaka Chavithi ) రోజు ఒక్క ఆకుతో పూజ చేస్తే దరిద్రం దూరమైపోయి ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.మీ పూజ గదిలో ఈ ఆకు ఉంటే పేదవాడు సైతం రాజు అవుతాడని చెబుతున్నారు.
వినాయక చవితి రోజు ఈ ఆకు పూజలో ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో వినాయక చవితి ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ పండుగను మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన పండుగగా జరుపుకుంటారు.పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకున్ని భావిస్తారు.
వినాయకుడు పవిత్రకు విజయానికి మారుపేరుగా ఉంటాడు.ఏ మంచి పని మొదలుపెట్టిన పూజ లేదా యజ్ఞలతో మొదలుపెడతారు.
అలాగే వినాయకుడిని పూజించడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది.గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం.
ఎన్ని రకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ ఈ గరిక లేకుండా విఘ్నేశ్వరుడి పూజ అసలు పూర్తి కాదు.
ఇంకా చెప్పాలంటే గరిక లేకుండా ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం ఉండదు. గరికకు ( Garika )హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.అలాగే గ్రహణ సమయంలో కూడా గరికను ఉపయోగిస్తూ ఉంటాము.
దీన్ని పూజకోసమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు ఆయుర్వేద శాస్త్రంలో ( Ayurvedic science )గరికను ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు వినాయకుని పూజించేటప్పుడు ఎన్ని పూలమాలలు సమర్పించిన ఎటువంటి పుష్పాలతో ఆయనని ఆయనను అలంకరించిన ఒక గరిక పూజలో లేకపోతే ఆ పూజ ఫలితం దక్కదని పండితులు చెబుతున్నారు అందుకే ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు కానీ మాత్రం తప్పకుండా సమర్పించాలని పండితులు( Scholars ) చెబుతున్నారు.ఇలా చేస్తే పేదవాడు కూడా ధనికులవడం ఖాయం అని చెబుతున్నారు.