మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ramcharan Tej ) అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ) మద్య ఎలాంటి బంధం ఉందో మనకు తెలిసిందే.వీరిద్దరూ సొంత అన్నదమ్ములు లాగే ఉంటారని తాజాగా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా చూస్తేనే అర్థమవుతుంది.
అయితే ఈ సినిమా రాకముందు నుంచి కూడా వీరిద్దరూ చాలా మంచి స్నేహితుల అనే విషయం మనకు తెలిసిందే.నటనపరంగా వీరిద్దరూ కూడా ఎంతో మంచి టాలెంట్ కలిగినటువంటి హీరోలు.
ఇలా నటన విషయంలో మాత్రమే కాదు ఇతరులకు ఇచ్చే గౌరవం విషయంలో కూడా ఇద్దరు ఒకటే అని చెప్పాలి.
ఇలా వీరి వ్యక్తిత్వాలు మనస్తత్వాలు ఒకటే కావడంతో వీరిద్దరితో సినిమా చేస్తే సినిమా అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించినటువంటి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా ఊహించిన విధంగానే బ్లాక్ బాస్టర్ కావడమే కాకుండా వీరిద్దరికి గ్లోబల్ స్టార్స్ అని ట్యాగ్ కూడా వచ్చింది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వీరిద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్నటువంటి ప్రేమను ఎన్నో సార్లు బయట పెట్టుకున్నారు.
ఇక రామ్ చరణ్ పుట్టినరోజు( Ram Charan Birthday ) సందర్భంగా బయటకు వెళ్లి చేసే హంగామా గురించి కూడా పలు సందర్భాలలో ఎన్టీఆర్ తెలిపారు.ఇలా తనకు రామ్ చరణ్ అంటే ఎంతో ప్రాణమని ఆయనతో అంత మంచి అనుబంధం ఏర్పడిందని ఎన్టీఆర్ తెలియజేశారు.
ఇలా తనకి ఎంతో ఆప్త మిత్రుడు ప్రాణ స్నేహితుడు అయినటువంటి చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టం కానీ ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్( Junior NTR ) కి చరణ్ అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.మరి ప్రాణ స్నేహితుడి విషయంలో ఎన్టీఆర్ కు నచ్చని ఆ క్వాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే…
సాధారణంగా ఎన్టీఆర్ తన గురించి ఎవరైనా మాట్లాడితే అవతలివారు ఎలా స్వీకరిస్తారో తెలియకుండా తనకు తోచిన సమాధానాన్ని చెప్పేస్తారు.కానీ చరణ్ మాత్రం అలా కాదట ఏదైనా విషయం గురించి అయినా తన అభిప్రాయం చెప్పాలనుకున్న కూడా తన అభిప్రాయంతో వారు ఎక్కడ బాధపడతారోనని కొన్ని విషయాలు బయటకు అసలు చెప్పరని, మనసులోనే దాచుకొని ఆ బాధను తానే అనుభవిస్తూ ఉంటారని ఎన్టీఆర్ తెలియజేశారు.అయితే ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతిని మార్చుకోవాలి మంచైనా చెడైనా ఇతరులతో పంచుకున్నప్పుడే బాధ తగ్గుతుందని సంతోషం రెట్టింపు అవుతుందని ఎన్నోసార్లు చరణ్ కి చెప్పిన తన పద్ధతి అసలు మార్చుకోడు అంటూ ఒక సందర్భంలో ఎన్టీఆర్ చరణ్ గురించి ఇలాంటి కామెంట్స్( NTR Charan ) చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.