నందమూరి యంగ్ జనరేషన్ హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్( Kalyam ram ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ ఇద్దరు హీరోల మార్కెట్ అంతకంతకూ పెరుగుతున్న విషయం విదితమే.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకోగా కళ్యాణ్ రామ్ కూడా రాబోయే రోజుల్లో పాన్ ఇండియా హీరోగా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని నమ్ముతున్నారు.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎలాంటి సీన్ ఇచ్చినా అద్భుతంగా నటిస్తారనే సంగతి తెలిసిందే.
అయితే ఈ ఇద్దరు హీరోలు రొమాంటిక్ సీన్లలో( Romantic scenes ) ఛాన్స్ వస్తే అంత బాగా యాక్ట్ చేయలేరట.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పలు సందర్భాల్లో రొమాంటిక్ సీన్లలో నటించడం అంటే ఇబ్బందిగా ఫీలవుతామని చెప్పుకొచ్చారు.
ఈ కారణం వల్లే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలలో లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సీన్లు తక్కువగా ఉంటాయి.
కథ మరీ డిమాండ్ చేస్తే మాత్రమే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో సినిమాను సైతం ప్రేక్షకులు కోరుకుంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కాంబినేషన్ దిశగా ఏ డైరెక్టర్ అడుగులు వేయడం లేదు.తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఅర్ నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించి వేర్వేరు అప్ డేట్స్ వచ్చాయి.
ఎన్టీఆర్31 ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఎన్టీఆర్32 అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మొదట విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.తారక్ సినిమాలన్నీ రికార్డులు క్రియేట్ చేయాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో ఎన్టీఆర్ ఒకరని చెప్పవచ్చు.