యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) హీరో గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.దేవర( devara ) కథ కు ఉన్న స్కోప్ కారణంగా రెండు భాగాలుగా సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించాడు.
కొరటాల శివ ఆ ప్రకటన చేసిన తర్వాత అంచనాలు పీక్స్ కు చేరాయి.మరీ ఇంతగా ఉన్న అంచనాలను కొరటాల శివ( Koratala Shiva ) ఎంత వరకు మోస్తాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా కొరటాల శివ యొక్క గత చిత్రం ఆచార్య ఫలితాన్ని ఈ సందర్భంగా కొందరు జ్ఞప్తికి తెస్తున్నారు.ఈ మధ్య కాలంలో హైప్ బాగా వచ్చిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.
అందుకే కాస్త జాగ్రత్తగా సినిమా ను ప్లాన్ చేస్తూ ఉన్నారా అంటూ దర్శకుడు కొరటాల శివ ను చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
కాస్త అటు ఇటు గా ఫలితం ఉన్నా కూడా రెండో పార్ట్ విషయం దేవుడు ఎరుగు.అసలుకే మోసం వస్తుంది.పెట్టిన పెట్టుబడి లో కనీసం 25 శాతం కూడా వచ్చే అవకాశం ఉండదు అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.
ఆచార్య వంటి డిజాస్టర్ వచ్చిన నేపథ్యం లో మరీ ఎక్కువ హైప్ పెంచకుండా దేవర సినిమా ను తీసుకు వస్తే కొరటాల శివ కు మంచిది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో ఇక నైనా దేవర సినిమా ప్రచారం ను కాస్త తగ్గించుకోవడం మంచిది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్ వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా లో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.