ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un )ఆగస్టు 4 నుంచి ఆగస్టు 5 వరకు తన దేశంలోని ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజన్ల తయారీ కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన పలు రైఫిల్స్, వెపన్స్ స్వయంగా చెక్ చేశారు.
ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు.అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్శన సమయంలో దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఆయుధ శక్తిని మరింత పెంచాలని కిమ్ సిబ్బందికి సూచించారు.యూఎస్, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు సిద్ధమవుతున్న సమయంలో కిమ్ ఆయుధ కర్మాగారాలను తనిఖీ చేశారు.
కిమ్ జోంగ్ ఉన్ చాలా గంటల పాటు ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజన్ల మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఆశ్చర్యపరిచారు.వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ఇంజన్ల తయారీ కేంద్రంతోపాటు ఇతర వెపన్ ఫ్యాక్టరీలు, అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీలు), భారీ రాకెట్ లాంచర్లకు అవసరమైన పనిముట్ల తయారీ కేంద్రాలను కూడా ఆయన విజిట్ చేశారు.

తమ శైలికి అనుగుణంగా వ్యూహాత్మక ఆయుధాలను అభివృద్ధి చేయాలని.ఇందుకోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ( Advanced technology ) గల ఇంజన్లను రూపొందించాలని కిమ్ జోంగ్ ఉన్ నిపుణులకు సూచించారు.భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, అత్యాధునిక క్రూయిజ్ క్షిపణిలతోపాటు ఇటీవల కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని కూడా ఆయన చెక్ చేశారు.కిమ్ జోంగ్ ఉన్ ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాలను సందర్శించడం ద్వారా తన దేశంలోని ఆయుధ శక్తిని పెంచడానికి కట్టుబడి ఉన్నారని చూపించారు.
అమెరికా, దక్షిణ కొరియాతో ఉన్న ఉద్రిక్తతలను ఎదుర్కోవడానికి ఈ చర్య ఒక చిహ్నంగా కూడా చూడవచ్చు.

ఉత్తర కొరియా(North Korea ) క్షిపణి పరీక్షలను తరచుగా నిర్వహిస్తోంది.ఈ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి.అమెరికా, దక్షిణ కొరియా ఉత్తర కొరియాపై ఆంక్షలను విధించాయి.
అయినప్పటికీ, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉంది.కిమ్ జోంగ్ ఉన్ ఆయుధ శక్తిని పెంచడం ద్వారా ఉత్తర కొరియాను బలంగా మార్చాలని ఆశిస్తున్నారని తెలుస్తోంది.
అయితే, అతని చర్యలు ప్రపంచంలోని ఇతర దేశాలతో ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది.