ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే వైసీపీ( YCP ) టికెట్ల కేటాయింపులు జరుగుతున్నాయి .
దీంతో ఆ పార్టీలో పరిస్థితి లో గందరగోళ వాతావరణం నెలకొంది .ఒకవైపు నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఖరారు చేస్తూనే మరువైపు భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం( Former Minister Mudragada Padmanabham ) వైసీపీలో చేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా , ముద్రగడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో చేరేది లేదని తేల్చి చెబుతున్నారు.ఆయన టిడిపి, జనసేన ల వైపు మొగ్గు చూపిస్తుండడంతో వైసీపీలో ఆందోళన కలిగిస్తోంది.

కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుంటే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు, మరికొన్ని జిల్లాల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని వైసిపి అంచనా వేసింది.అయితే ముద్రగడ మాత్రం జనసేన( Janasena ) వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.ప్రస్తుతం టీడీపీ , జనసేనలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జనసేనలో చేరితే తమ కోరిన సీట్లు దక్కడంతో పాటు , గెలుపునకు డోఖా ఉండదని ముద్రగడ అంచనా వేస్తున్నారట.కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న ముద్రగడను చేర్చుకుంటే , ఆ వర్గం ఓట్లు తమకు కలిసి వస్తాయని వైసిపి అంచనా వేస్తూ, ఎలాగైనా ముద్రగడను తమ పార్టీలో చేర్చుకునేలా పావులు కదుతుండగా, టిడిపి, జనసేన సైతం ముద్రగడ కోసం ప్రయత్నం చేస్తున్నాయి.

స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముద్రగడ నివాసానికి రాబోతున్నట్లు సమాచారం.ఆ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముద్రగడను కలిసినందుకు ప్రయత్నించినా, మీకు మాకు సెట్ అవదు, టిడిపిలోకి అయినా జనసేనలోకి అయినా వెళ్తా.కాదనుకుంటే ఇంట్లో అయినా ఖాళీగా కూర్చుంటా కానీ , వైసీపీలోకి వచ్చే ప్రసక్తి లేదు .నన్ను కలిసేందుకు వచ్చి మీ సమయం వృధా చేసుకోవద్దు .మీ పని మీరు చూసుకోండి అంటూ ముద్రగడ తేల్చి చెప్పేస్తూ ఉండడం తో, వైసీపీ కి ఆయన డోర్ క్లోజ్ చేసినట్టు అర్దం అవుతోంది.ఆయన జనసేన లో చేరబోతున్నట్టు గా ఆయన అనుచరులు క్లారిటీ ఇస్తున్నారు.