అగ్ర దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు.దక్షిణాది భాషల్లో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా ఈయన పేరు గడించాడు.
ఇప్పటికి ఈయన భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు.అయితే బాహుబలి వంటి సినిమా తర్వాత శంకర్ వైపు ఉన్న ద్రుష్టి రాజమౌళి వైపు మళ్లడంతో టాప్ డైరెక్టర్ అంటే రాజమౌళి పేరునే చెబుతున్నారు.
కానీ సరైన హిట్ పడితే శంకర్ ఇప్పటికీ టాప్ లిస్టులో చేరుకునే అవకాశం ఉంది.
అందుకే ఈయన మళ్ళీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు.
శంకర్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు.RC15 సినిమాలో రామ్ చరణ్ ను భిన్నంగా చూపించ బోతున్నాడు.ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాతో పాటు శంకర్ గత కొన్ని రోజులు క్రితం మధ్యలోనే వదిలేసిన ఇండియన్ 2 సినిమా ఇప్పుడు సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

దీంతో మధ్యలో కొన్ని రోజులు చరణ్ సినిమాకు బ్రేక్ వేయాల్సి వచ్చింది.ఇక ఇటీవలే చరణ్ సినిమాకు సంబంధించిన ఒక పాట షూట్ కోసం న్యూజిలాండ్ వెళ్లి పూర్తి చేసుకుని వచ్చారు.ఇక మళ్ళీ ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి శంకర్ ఇండియన్ 2 సినిమాకు షిఫ్ట్ అయిపోయి ఈ రోజు నుండి చెన్నైలో షూట్ కూడా స్టార్ట్ చేయనున్నారు.

ఈ నెల మొత్తం ఆ సినిమా మీదనే శంకర్ వర్క్ చేయబోతున్నారు.ఆ తర్వాత జనవరిలో మళ్ళీ చరణ్ సినిమాకు షిఫ్ట్ అవుతారట.ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మ్యానేజ్ చేస్తూ వస్తున్నాడు.
కానీ ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ ఇతడు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తుంది. చరణ్ సినిమాను 2024లో రిలీజ్ చేయాలని భావిస్తుండగా.
ఇండియన్ 2 సినిమాను మాత్రం 2023 లోనే రిలీజ్ చేయనున్నారట.అయితే ఈయన ప్లానింగ్ అంతా ఓకే కానీ ఈ రెండు సినిమాలకు ప్రెజెంట్ ఎలాంటి బజ్ లేదు.
ఇదే ఇప్పుడు ఇరు హీరోల ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది.