తెలుగు సినీ నటి నివేతా పేతురాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి అని చెప్పవచ్చు.తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ.
అతి తక్కువ సమయంలో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.చూడటానికి సీరియస్ లుక్ తో కనిపించే ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎక్కువగా నెగిటివ్ పాత్రలలోనే నటించింది.
తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించింది నివేతా.ఇక మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.తొలిసారిగా 2016లో తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత ఏడాది మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇక వరుసగా తమిళ, తెలుగు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.
చిత్రలహరి, అలా వైకుంఠపురంలో సినిమాలలో మాత్రం సీరియస్ పాత్రలలో బాగా మెప్పించింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇక నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాగల్’ సినిమాతో తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.
ముఖ్యంగా ఫోటోషూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను, ఫన్నీ రీల్స్ వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందడానికి బాగా ప్రయత్నిస్తుంది.దీంతో తన ట్రెండీ లుక్ లతో బాగా హడావుడి చేస్తుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక తన అభిమానులతో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.
వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.
అప్పుడప్పుడు తన మూవీ అప్డేట్ లను కూడా పంచుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకుంది.అయితే అందులో తన ఫోటోలను క్రాప్ చేసి ఎడిట్ చేసింది.
ఇక తను టీ షర్ట్ వేసుకొని తన లుక్స్ తో మతి పోగొట్టింది.అయితే అందులో కొంతమంది తన టీ షర్ట్ పై ఉన్న కొటేషన్ చూసి తెగ చర్చలు చేసుకుంటున్నారు.
అయితే అందులో ఏమి రాసి ఉందంటే.బాయ్స్ ఇన్ బుక్స్ ఆర్ జస్ట్ బెటర్ అని ఉండగా అబ్బాయిలు బుక్స్ లో ఉండడమే బెటర్ అన్నట్లుగా తెలిపింది.దీంతో ఆ ఫోటో చూసిన కొందరు నిజమే అన్నట్లుగా సమాధానం ఇస్తున్నారు.మొత్తానికి ప్రస్తుతం ఆమె తన టీ షర్ట్ ద్వారా చెప్పిన లైన్ మాత్రం బాగా వైరల్ అవుతుంది.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసింది.