నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’.శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నారు.

 Nithiin Macherla Niyojakavargam Releasing Grandly Worldwide On August 12th , Nit-TeluguStop.com

ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

అయితే కొన్ని పనులు పెండింగ్ లో వుండటం చేత సినిమా వాయిదా పడింది.ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం కొత్త విడుదల తేది ఖరారైయింది.

ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్ కూడా ఈ చిత్రానికి కలసిరానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నితిన్ లుక్ ఆకట్టుకుంది.బ్లూ జీన్స్ వైట్ షర్టులో టక్ చేసుకొని హాండ్స్ ని పోల్డ్ చేస్తున్న స్టిల్ లో నితిన్ సాలిడ్ గా కనిపించారు.

స్టయిలీస్ గా కనిపిస్తూనే మాస్ యాక్షన్ లుక్స్ తో దూకుడు చూపించారు నితిన్.ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలని ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు.నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.పోస్టర్, టీజర్ వీడియోలో నితిన్ మునుపెన్నడూ విధంగా డిఫరెంట్ యాక్షన్ లుక్ తో ఆకట్టుకున్నారు.

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.పొలిటికల్ నేపధ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని డిజైన్ చేస్తున్నారు.

తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube