డ్రాగన్ దేశంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఫ్రిజ్ లో ఉన్న నూడిల్స్ తిని ఒకే ఇంట్లో తొమ్మిది మంది మరణించిన ఘటన కలకలం రేపింది.
ఫ్రిజ్ లో ఉన్న నూడిల్స్ ఏంటి? తింటే ప్రాణాలు కోల్పోవడం ఏంటి? అని అనుకుంటున్నారా.దాని గురించి చెప్పాలి అంటే మామూలుగా ఇలాంటి జంక్ ఫుడ్స్ ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని, ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి జంక్ ఫుడ్ లను తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు.
కానీ జనాలు మాత్రం ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలకు ఇలా ఏకంగా ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది.అలాంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ తాజా ఘటన చోటుచేసుకుంది.
నార్త్ ఈస్ట్రన్ చైనీస్ ప్రాంతంలోని హెయిలోంగ్ జియాంగ్ లో ఒకే కుటుంబంలో 12 మంది బంధువులు కలుసుకున్నారు.అయితే అందరూ ఒక్క చోట చేరుకోవడం తో ఎదో ఆ క్షణాలను మరింత మధురంగా చేసుకోవడం కోసం అందులో 9 మంది మొక్కజొన్న పిండి తో చేసిన సున్ టంగ్ జి అనే ప్రత్యేక నూడిల్స్ ను తయారు చేసుకున్నారు.
అయితే విషయం ఏమిటంటే ఆ నూడిల్స్ గత ఏడాదిగా ఫ్రిజ్ లోనే ఉంచగా, ఆరోజు అనగా అక్టోబర్ 5 న ఆ తొమ్మిది మంది తమ మార్నింగ్ ఫుడ్ మీటింగ్ లో తిన్నారు.అయితే అవి ఎక్కువ కాలం నుంచి ఫ్రిజ్ లోనే ఉంచడం తో అవి పాశనంగా మారి వారి ప్రాణాల మీదకు తెచ్చినట్లు తెలుస్తుంది.
అందుకే ఆ నూడిల్స్ తిన్న ఆ తొమ్మిది మంది కూడా తీవ్ర అస్వస్థతకు గురికావడం తో ఆసుపత్రికి తరలించారు.
అయినప్పటికి ఆ తొమ్మిది మంది లో 7 మంది ఈ నెల 10 న మరణించగా, ఈ నెల 12 న ఒకరు,19 న మరొకరు మరణించినట్లు తెలుస్తుంది.
దీనితో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడ తీవ్ర కలకలం రేపింది.దీనిపై చైనీస్ హెల్త్ కమిషన్ జాతీయ హెచ్చరికను కూడా చేసింది.
ఈ విధంగా పులియబెట్టిన పిండితో చేసిన వంటలను తినడం మానేయాలని, ఆరోగ్యంగా ఉండాలి అని సూచించింది.