లవ్ సీన్స్ లో ఆమెనే ఊహించుకుంటా.. నిఖిల్ కీలక వ్యాఖ్యలు..?

అర్జున్ సురవరం సినిమాతో హిట్ సాధించిన నిఖిల్ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ హీరో 18 పేజెస్ సినిమాతో పాటు కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ2 సినిమాపై తెరకెక్కుతుంది.

 Nikhil Siddarth  Imagined His Wife While Acting In Love Scenes , 18 Pages, Karth-TeluguStop.com

నిన్న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 18 పేజెస్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఆ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.

లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా లవ్ సీన్లలో నటించడం గురించి నిఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లవ్ సీన్లలో నటించే సమయంలో తాను తన భార్యను ఊహించుకుంటానని నిఖిల్ అన్నారు.

నిఖిల్ గతేడాది డాక్టర్ గా పని చేస్తున్న పల్లవిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం నిఖిల్ కరోనా కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తుండగా తన భార్య కూడా సహకారం అందిస్తున్నట్టు నిఖిల్ తెలిపారు.

పెళ్లి తర్వాత సులువుగా ప్రేమ సన్నివేశాల్లో నటించగలుగుతున్నానని నిఖిల్ చెప్పుకొచ్చారు.

Telugu Pages, Bunny Vasu, Corona, Karthikeya, Love, Nikhil Siddarth, Nikhil, Pal

సుకుమార్ కథ, కథనం అందించిన 18 పేజెస్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీవాసు నిర్మిస్తున్నారు.పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తుండటం గమనార్హం.

Telugu Pages, Bunny Vasu, Corona, Karthikeya, Love, Nikhil Siddarth, Nikhil, Pal

కుమారి 21ఎఫ్ సినిమా తరువాత పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నిర్మాతలలో ఒకరైన బన్నీవాసు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాతో పాటు చందూ మొండేటి డైరెక్షన్ చేస్తున్న కార్తికేయ 2 సినిమా షూటింగ్ జరుగుతోంది.నిఖిల్ సినీ కెరీర్ లో కార్తికేయ బిగ్గెస్ట్ హిట్ కాగా కార్తికేయ2 ఆ సినిమాను మించి హిట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube