నిహారిక కొణిదెల(Niharika Konidela) మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చినటువంటి ఏకైక హీరోయిన్ ఈమె అని చెప్పాలి.ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయిన ఈమె పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
అయితే వైవాహిక జీవితంలో కూడా ఈమె ఎక్కువ కాలం ఉండలేకపోయారు.దీంతో తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు (Venkata Chaitanya) విడాకులు ఇచ్చి ఈమె తన ఫోకస్ మొత్తం కెరియర్ పై పెట్టారు.
ఇలా నిహారిక ప్రస్తుతం స్వేచ్ఛ జీవిగా తనకు ఇష్టం వచ్చినట్లు తన జీవితాన్ని మలుచుకుంటున్నారు అయితే ఈమె విడాకుల తర్వాత పూర్తిగా తన దృష్టి సినిమాలపైనే పెట్టారు.దీంతో వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా నిర్మాతగా మారిపోయారు.

ఇలా ఈమె నిర్మాణంలో వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా సినిమాలు కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే పలువురు డైరెక్టర్లు చెబుతున్నటువంటి కథలను వింటూ ఉన్నారు.ఇలా సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టినటువంటి నిహారిక తన బాడీ ఫిట్నెస్ పై కూడా చాలా ఫోకస్ పెట్టారు.ఈ క్రమంలోనే ఈమె తరచూ జిమ్ (Gym) లోపెద్ద ఎత్తున వర్క్ అవుట్(Work Out) చేస్తూ సందడి చేస్తుంటారు.
ఈ క్రమంలోనే జిమ్ లో ఈమె వర్కర్స్ చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా మరోసారి ఈమె తన జిమ్ ట్రైనర్ (Gym Trainer) తో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలను చూస్తుంటే ఈమె భారీగానే జిమ్ లో చెమటలు చిందిస్తున్నారని తెలుస్తోంది.అయితే వర్కౌట్ అనంతరం ఈమె తన జిమ్ ట్రైనర్ తో కలిసి మిర్రర్ సెల్ఫీ కి ఫోజులిచ్చారు.
దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలపై పలువురు స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.విడాకులు తీసుకున్న తర్వాత ఆ డిప్రెషన్ నుంచి బయటపడటం కోసమే ఇలా చేస్తున్నారు అంటూ పలువురు ఈ ఫోటోలు పై కామెంట్లు చేస్తున్నారు.