భారతీయుల ఫేవరేట్ పండుగలలో ఒకటైన దీపావళికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది.దీపావళికి న్యూయార్క్ నగరంలోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రతిపాదించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్( State Governor Cathy Hochul ) ఆమోదముద్ర వేశారు.
దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది.తద్వారా ఇకపై దీపావళి నాడు న్యూయార్క్‌లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది.
న్యూయార్క్ ( New York )నగరం విభిన్న మతాలు, సంస్కృతులతో సమృద్ధిగా వుందన్నార్ గవర్నర్.పాఠశాల క్యాలెండర్‌లో వైవిధ్యాన్ని గుర్తించి, జరుపుకోవడానికి కీలక అడుగు వేస్తున్నామని క్యాథీ హోచుల్ పేర్కొన్నారు.
ప్రతి ఏడాది భారతీయ క్యాలెండర్ ఎనిమిదవ నెలలో 15వ రోజున దీపావళిగా పిలుస్తారని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఆ రోజున నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చట్టం చెబుతోందని పేర్కొంది.
దీపావళి రోజున న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుగా పేర్కోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వున్న సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి పిల్లలకు ఒక అద్భుత అవకాశంగా గవర్నర్ వెల్లడించారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడి ఫ్లషింగ్‌లోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికాలో( Hindu Temple Society of North America ) జరిగిన ప్రత్యేక రిసెప్షన్ సందర్భంగా హోచుల్ చట్టంపై సంతకం చేశారు.దీపావళిని జరుపుకోవడానికి హాజరైనప్పుడు , దీవాళిని న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్‌కు( New York City public school ) సెలవుదినంగా చేసే చారిత్రాత్మక చట్టంపై సంతకం చేయడం గర్వంగా వుందన్నారు.న్యూయార్క్ నగర విద్యాశాఖ ప్రకారం.2022-23లో అమెరికాలోని అతిపెద్ద పాఠశాల జిల్లా అయిన న్యూయార్క్ స్కూల్ సిస్టమ్‌లో 1,047, 895 మంది విద్యార్ధులు వున్నారు.వారిలో 16.5 శాతం మంది ఆసియన్లే.2022 చివరి నాటికి ఇక్కడ 1,867 పాఠశాలలు వుండగా, అందులో 275 చార్టర్ పాఠశాలలు వున్నాయి.న్యూయార్క్ నగరంలోని ప్రభుత్వ స్కూళ్లకు దీపావళిని సెలవు దినంగా ప్రకటించడానికి విద్యాచట్టాన్ని సవరిస్తున్నట్లు పత్రిక ప్రకటన తలిపింది.
గవర్నర్ సంతకం నేపథ్యంలో దక్షిణాసియా వాసులు ముఖ్యంగా ప్రవాస భారతీయులు రెండు దశాబ్ధాలుగా చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లయ్యింది.ఇందుకోసం న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన జెనిఫర్ రాజ్‌కుమార్ ( Jennifer Rajkumar )ఎంతో కృషి చేశారు.అయితే న్యూయార్క్‌లోని స్కూళ్లకు దీపావళి నాడు సెలవు ప్రకటించినప్పటికీ.
ఈ ఏడాది మాత్రం అది అందుబాటులో వుండదు.ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ఆరంభమైన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి దీపావళి నాడు సెలవు అమల్లోకి రానుంది
.