జబర్దస్త్ కు కొత్త యాంకర్.. ఏకంగా పల్లకిలో తీసుకొచ్చారుగా?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ జబర్థస్త్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత 10 సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ కామెడీ షో నిర్విఘ్నంగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 New Anchor For Jabardasth In Place Of Anasuya Anchor Manjush Details, New Anchor For Jabardasth , Anasuya, Anchor Manjush, Anchor Rashmi, Manjusha Jabardasth, Extra Jabardasth, Etv,-TeluguStop.com

ఈ షో కి యాంకర్లుగా వ్యవహరించిన అనసూయ రష్మి యాంకర్లు గా బాగా పాపులర్ అయ్యారు.ఇక ఈ షో టీమ్ లీడర్లు గా ఉన్న ఆది, సుధీర్ తో పాటు గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వంటి వారు బాగా పాపులర్ అయ్యారు.

అయితే ఈ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన చాలా మంది ఈ షో నుండి బయటికి వెళ్ళిపోయారు.ఇలా జబర్థస్త్ కి దూరమైనవారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.

 New Anchor For Jabardasth In Place Of Anasuya Anchor Manjush Details, New Anchor For Jabardasth , Anasuya, Anchor Manjush, Anchor Rashmi, Manjusha Jabardasth, Extra Jabardasth, Etv, -జబర్దస్త్ కు కొత్త యాంకర్.. ఏకంగా పల్లకిలో తీసుకొచ్చారుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జబర్దస్త్ మొదలైన నాటి నుండి అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తోంది.ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంది.ఇలా సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో డేట్స్ కుదరక జబర్దస్త్ కి దూరమయింది.గత కొన్ని రోజులుగా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్నట్లు అనసూయ హిట్ ఇస్తూ వచ్చింది.

ఇక గతవారం ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో అనసూయ ఈ విషయం గురించి ప్రేక్షకులకి ఫుల్ క్లారిటీ ఇచ్చింది.గతవారం ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో జబర్దస్త్ యాజమాన్యం వారు అనసూయ కి సెండ్ ఆఫ్ ఇచ్చారు.

ఇక జబర్దస్త్ లో అనసూయ స్థానంలో యాంకర్ గా ఇప్పటికే యాంకర్ మంజుష పేరు వినిపిస్తోంది.ఎన్నో సంవత్సరాలుగా యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఈవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త యాంకర్ ని పల్లకిలో తెచ్చి చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

అయితే ఆ కొత్త యాంకర్ ఎవరన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.

జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్ ఎవరు అని తెలుసుకోవటానికి ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube