ఇండియాలో పెద్దగా ఓటీటీ గురించి తెలియని సమయం లోనే నెట్ ఫ్లిక్స్ రంగ ప్రవేశం చేసింది.హాలీవుడ్ కంటెంట్ ను ఇష్టపడే వారికి నెట్ ఫ్లిక్స్ దగ్గర అయింది.
మెల్ల మెల్లగా నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఏ స్థాయి లో ఇండియన్ సినిమా లో మిలితం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నెట్ ఫ్లిక్స్ ను గతంలో చాలా మంది రేటు ఎక్కువ అని లైట్ తీసుకునే వారు.
కానీ ఇప్పుడు అందులో ఉన్న కంటెంట్ కోసం ఎంత పెట్టి అయినా తీసుకోవాలని అనుకుంటున్నారు.సినిమా లు మరియు సిరీస్ లతో ఇండియా లో అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న నెట్ ఫ్లిక్స్ కి ఇంకా తెలుగు ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయి లో స్పందన రావడం లేదట.
అందుకే నెట్ ఫ్లిక్స్ ఇండియా వారు తెలుగు కంటెంట్ విషయం లో శ్రద్ద పెంచారు అంటూ వార్తలు వస్తున్నాయి.
అందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ అధినేత తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అవ్వడం చర్చనీయాంశం అయింది.ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ప్రముఖులను నెట్ ఫ్లిక్స్ అధినేత కలిశారు.చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, త్రివిక్రమ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులను కలవడం ద్వారా నెట్ ఫ్లిక్స్ వారు ఏదో పెద్ద స్కెచ్ వేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భారీ ఎత్తున సినిమాలు మరియు సిరీస్ లను తెలుగు ప్రేక్షకుల ముందుకు నెట్ ఫ్లిక్స్ తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.తప్పకుండా అన్ని వర్గాల వారికి నెట్ ఫ్లిక్స్ ముందు ముందు మరింత చేరువ అయ్యేందుకు ఈ భేటీలు, చర్చలు ఉపయోగపడుతాయి అంటూ ఇండస్ట్రీ కి చెందిన వారు మరియు సినీ విశ్లేషకులు ఇంకా మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.