ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన వాళ్లలో నెల్లూరు కవిత ఒకరు.నెల్లూరు కవిత డ్యాన్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
అయితే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను నార్మల్ గా కామ్ గా ఉంటానని అన్నారు.స్టేజ్ ఎక్కితే మాత్రం పూనకం వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం జబర్దస్త్ షో షూటింగ్ లో పాల్గొంటున్నానని నెల్లూరు కవిత వెల్లడించడం గమనార్హం.
శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన తర్వాత ఊహించని రేంజ్ లో పాపులారిటీ పెరగడంతో నెల్లూరు కవితకు ఆఫర్లు కూడా పెరుగుతున్నాయని తెలుస్తోంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఫేమస్ అవుతానని అనుకున్నానని కానీ ఈ స్థాయిలో నాకు రీచ్ వస్తుందని నేను భావించలేదని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా ద్వారా టాలెంట్ ఉన్నవాళ్లకు ఎక్కువ ఛాన్స్ లు వస్తున్నాయని కవిత పేర్కొన్నారు.
ఝాన్సీ అక్క నాకు మంచి ఫ్రెండ్ అని ఆమె వెల్లడించారు.నూకరాజు గారి టీమ్ లో నేను కనిపించనున్నానని కవిత అన్నారు.
కామెంట్లను దృష్టిలో ఉంచుకుని నేను కొన్ని విషయాలలో మారతానని ఆమె చెప్పుకొచ్చారు.
విమర్శలను పట్టించుకుంటూ వెళితే ముందుకు వెళ్లలేమని కవిత వెల్లడించారు.సినిమాలు, సీరియళ్లలో కెరీర్ ను కొనసాగించాలని భావిస్తున్నానని ఆమె అన్నారు.
పెళ్లి గురించి ఆలోచనలు ఉన్నాయని నెల్లూరు కవిత తెలిపారు.
ఈవెంట్ ఆర్గనైజర్ ను పెళ్లి చేసుకోబోతున్నానని ఆమె పేర్కొన్నారు.బెంగళూరు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో నేను పర్ఫామ్ చేశానని కవిత వెల్లడించారు.
వైజాగ్ లో కూడా నాకు మంచి సపోర్ట్ వచ్చిందని తెలిపారు.నెల్లూరు కవిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెల్లూరు కవితకు భారీగానే రెమ్యునరేషన్ దక్కుతోందని తెలుస్తోంది.