తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్ లో 9 వారాలపాటు సక్సెస్ ఫుల్ గా కొనసాగింది.అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత చాలామంది లైఫ్ బాగుంటుంది అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అలా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత వాసంతి బాగా పాపులారిటీని సంపాదించుకుంది.
అంతేకాకుండా ఎలిమినేట్ బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూ లతో హడావిడి చేసింది.
నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందనుకున్న ఆమెకు అందం ప్లస్ పాయింట్ అయింది అని చెప్పవచ్చు.మొదట్లో ఎక్కువగా అందంగా కనిపించడానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాసంతి ఆ తర్వాత కాస్త పుంజుకుని లక్కీగా 9 వారాలు నెట్టుకొచ్చింది.
ఇంటర్వ్యూల తర్వాత వాసంతి కొద్ది రోజులు కనిపించకుండా పోయినప్పటికీ తాజాగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ఒక సీరియల్ లో కనిపించింది.బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూడు వారాల్లోనే వాసంతి స్టార్ మాలో ప్రసారం కాబోతున్న అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సీరియల్ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
అందులో ఒక అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.అంతే కాకుండా పల్లెటూరి లాంగ్వేజ్ లో మాట్లాడుతూ నటించనుంది.ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.కాగా ఈ సీరియల్ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత స్టార్ మా లో ప్రసారం కాబోతోంది అని తెలుస్తోంది.
కాగా ఈ సీరియల్ లో హీరో డబల్ యాక్షన్ లో నటించిన ఉన్నాడు.ఒక పాత్రలో అమాయకుడి క్యారెక్టర్ మరొక పాత్రలో రౌడీ క్యారెక్టర్ నటించనున్నాడు.ఇక ఇందులో అమాయకుడి పాతలో నటించే హీరో పక్కన నటించనుంది వాసంతి.