ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్ సీట్లు.. ఈ విద్యార్థుల సక్సెస్ స్టోరీ వింటే ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో నీట్ పరీక్ష( NEET Exam ) రాసి మెడికల్ సీటు సాధించడం అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఒక ఇంట్లో మాత్రం ఒకటి కాదు రెండు ఏకంగా ముగ్గురు నీట్ పరీక్ష రాసి సక్సెస్ సాధించారు.

 Neet Rankers Success Stories In Telugu Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

నల్గొండ జిల్లా వీర్లపాలెం గ్రామానికి చెందిన నేనావత్ బుజ్జిబాబు పార్వతి( Nenavat Bujjibabu Parvati) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.వీరు ముగ్గురు నీట్ ర్యాంక్ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

పెద్ద కూతురు హైమావతి( Haimavati ) నాలుగేళ్ల క్రితం నీట్ లో ర్యాంక్ సాధించి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ లో చేరి హౌస్ సర్జన్ పూర్తి చేశారు.రెండో కూతురు నేనావత్ పద్మ( Nenavat Padma ) రెండేళ్ల క్రితం నీట్ లో ర్యాంక్ సాధించడంతో పాటు విజయవాడ సిద్దార్థ కాలేజ్ లో పని చేస్తున్నారు.

కొడుకు రామకృష్ణ( Ramakrishna ) తాజాగా విడుదలైన నీట్ ఫలితాలలో మంచి ర్యాంక్ సాధించి ఉస్మానియాలో సీటు సాధించడం గమనార్హం.

ఒకే కుటుంబంలో ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ మెడికల్ విద్యను అభ్యసిస్తూ వార్తల్లో నిలిచారు.

స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య చదివి నీట్ ర్యాంక్ సాధించిన ఈ ముగ్గురు విద్యార్థులు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.పట్టుదలతో చదివితే సక్సెస్ సాధించడం సులువేనని ఈ ముగ్గురు అక్కాతమ్ములు ప్రూవ్ చేస్తున్నారు.

తమ సక్సెస్ తో గ్రామంలోని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

Telugu Haimavati, Neet Ranker, Neet Rankers, Nenavat Padma, Parvati, Ramakrishna

ఈ ముగ్గురు అక్కాతమ్ముళ్లు కెరీర్ పరంగా మరింత ఎదిగి ప్రజలకు తక్కువ ధరకే వైద్య సేవలను అందించాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.ముగ్గురు పిల్లలను ప్రయోజకులను చేసిన తల్లీదండ్రులను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.టాలెంట్, కష్టపడే గుణం ఉన్న పిల్లలను తల్లీదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్లు కెరీర్ పరంగా సంచలనాలు సృష్టిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube