యంగ్ హీరో నాని ఇటీవలే అంటే సుందరానికి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన అంటే సుందరాకిని సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఆ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో నాని భారీ ఎత్తున ప్రమోషన్ చేశాడు.కాని సినిమా కు వచ్చిన వసూళ్లకు టాక్ కు సంబంధం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
నాని చాలా కష్టపడ్డాడు కాని ఫలితం మాత్రం దక్కలేదు.హీరోగా నాని చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈమద్య సక్సెస్ కాలేక పోతున్నాయి.
తాజాగా నాని ని ప్రమోషన్ లో చూస్తే ఆయన గత కొన్ని రోజులుగా గడ్డం తో కనిపిస్తున్నాడు.గడ్డం లో కనిపించడం వల్ల నాని ఫ్యాన్స్ కు చిరాకు గా ఉందట.
నాని ఇంకా ఎన్నాళ్లు ఈ గడ్డం లుక్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇంతకు నాని ఈ గడ్డం లుక్ దేనికో తెలుసు కదా… ఔను దసరా సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసం ఈయన గడ్డం లో కనిపిస్తున్నాడు.
పుష్ప సినిమా కోసం ఎలా అయితే బన్నీ గడ్డం పెంచాడో ఇప్పుడు నాని కూడా దసరా సినిమా కోసం గడ్డం పెంచాడు.దసరా సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందట.
అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు దసరా షూటింగ్ ముగిసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత త్వరలోనే పక్క రాష్ట్రం లో షూటింగ్ కు వెళ్తారట.అక్కడి తో షెడ్యూల్ పూర్తి అవుతుంది.
తద్వారా మొత్తం సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు అవుతుందని నాని సన్నిహితులు అంటున్నారు.ఎప్పుడైతే దసరా సినిమా షూటింగ్ పూర్తి అవుతుందో అప్పుడు వెంటనే గడ్డం ను తొలగించి కొత్త సినిమా షూటింగ్ లో ఈయన పాల్గొంటాడు అంటున్నారు.