Nandamuri Taraka Ramarao: ఎన్టీఆర్ పేరు చెప్పుకొని అందరూ పబ్బం గడుపుతున్నారు..ఇంత అవమానమా ?

Nandamuri Taraka Ramarao And His Bharata Ratna Details

ఎన్టీఆర్ శత జయంతి( NTR Centenary ) ఉత్సవాలను జరుపుకుంటున్న వేళ ఆయన జీవితంలో ఎన్నో మరుపురాని సంఘటనలు మరో మారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆయన ఎదిగిన విధానం, అలాగే మరణించిన తీరు ప్రతి ఒక్కటి కంటతడి పెట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా కనబడుతున్నాయి.

 Nandamuri Taraka Ramarao And His Bharata Ratna Details-TeluguStop.com

ఇంట్లో వారు, బయట వారందరూ కలిసి ఎన్టీఆర్ ను ఎలా మోసం చేశారు, ఆయన చావుకు ఎలా కారణమయ్యారు అని అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇన్ని విషయాల మధ్య ఎన్టీఆర్ నీ( Nandamuri Taraka Ramarao ) ఇప్పటి వరకు ఎందుకు భారతరత్నకు సిఫార్సు చేయలేదు అనేది అభిమానులు అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న.

ఆయన వారసత్వాన్ని అందుకున్నారు అలాగే పెట్టిన పార్టీని ( TDP ) తీసుకున్నారు ఆస్తులను కూడా పంచుకున్నారు ప్రతి ఒక్కటి ఆయనకు సంబంధించి లాగేసుకున్నారు మరి ఆయనకు భారతరత్న( Bharata Ratna ) వద్ద ఆయన భారత రత్నకు అనర్హుడా? లేక ప్రతి ఏడాది ఇదొక సాకు చూపించి జనాల మధ్య సానుభూతి కోసం ప్రయత్నించడమే పరమావధి అని అనుకుంటున్నారా.? ఆయన బ్రతికున్నప్పుడే ఒంటరిని చేశారు.చివరికి ఆస్తులు అన్ని తీసుకొని సన్యాసిని చేశారు ప్రజల కోసం ఏదో సేవ చేయాలని ఆయన పార్టీ పెట్టుకుంటే దొంగల్లా పార్టీలో దూరారు ఆ తర్వాత పార్టీ నే కైవసం చేసుకున్నారు ముఖ్యమంత్రి పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు.

వైస్రాయ్ ముందుకు వచ్చి తెలుగు తమ్ములను పిలవాలంటే చెప్పులతో సత్కరించారు.

Telugu Bharatha Rathna, Nandamuri, Nandamuri Fans, Nandamuritaraka, Sr Ntr, Srnt

ఇంత చేసిన ఆ ఒక్కరికి విశ్వాసం లేదు.ఆయన వల్ల రాజకీయాల్లో సినిమాల్లో ఎదిగిన వారికి ఆయన పట్ల కృతజ్ఞత లేదు.ఆయన ఆస్తిపాస్తులు తింటున్న కుటుంబ సభ్యులకి తండ్రికి భారతరత్న వస్తే అది తమకే దక్కే గౌరవం అన్న ఇంగిత జ్ఞానం లేదు.

ఆయన పెట్టిన రాజకీయ పార్టీ ద్వారా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి నేడు మంత్రు పదవుల్లో మంచి స్థానాల్లో ఉన్నప్పటికీ ఆయనకు ఒక్కసారైనా గౌరవం ఇచ్చింది లేదు తాతల పేరు చెప్పి నేతుల వాసన చూడమనే బ్యాచ్ తప్ప ఒక్కరు కూడా నిస్వార్ధంగా ఎన్టీఆర్ కోసం ఎవ్వరూ కోరుకోవడం లేదు నేడు శతజయంతి ఉత్సవాలు చేస్తే ఆయన అభిమానులు బాధపడటం తప్ప ఒరిగేది కూడా ఏమీ ఉండదు.

Telugu Bharatha Rathna, Nandamuri, Nandamuri Fans, Nandamuritaraka, Sr Ntr, Srnt

ఎవరికివారు మేము నందమూరి రాజకీయానికి వారసులము లేదా కుటుంబానికి వారసులము అంటూ గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది.బ్లడ్డు, బ్రీడు అంటూ తన గొప్పలు తాము చెప్పుకోవడమే తప్ప ఆ బ్లడ్ కు మర్యాద ఇచ్చిన దాఖలాలు లేవు.ఆయన వల్ల అందరూ లాభపడ్డారే కానీ ఒక్కరు కూడా మోసపోయింది లేదు.

ఆయనకు భార్య లేక ఒంటరిగా ఉన్న సమయంలో సమయానికి తిండి పెట్టే వారు కూడా లేకపోతే లక్ష్మీపార్వతి ( Lakshmi Parvathi ) ఆయన జీవితంలోకి వచ్చింది కానీ ఆడదాని సుఖం కోసం ఏనాడు ఆయన కోరుకుని లేదు.ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయనకు భారతరత్న వచ్చేదాకా పోరాటం చేయండి.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి నిరూపించుకోండి

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube