టాలీవుడ్ కింగ్ నాగార్జున( Nagarjuna ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో సినిమాలలో చేసిన ఈయన స్టార్ హోదాకి చేరుకొని మంచి అభిమానంను సంపాదించుకున్నాడు.
కేవలం సినిమాలోనే కాకుండా రియాలిటీ షో లలో కూడా తన సత్తా చూపుతున్నాడు.అయితే ఈ మధ్యకాలంలో సినిమాల పరంగా నాగార్జునకు అస్సలు కలిసి రావడం లేదు.
వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు నాగార్జున.
కానీ రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss show ) తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.గత కొన్ని రోజుల నుండి బిగ్ బాస్ సీజన్ 7 గురించి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి కూడా సోషల్ మీడియాలో జోరుగా వార్తలైతే వస్తున్నాయి.అంతే కాదు వారి రెమ్యూనరేషన్ విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గానే ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా ఈసారి సీజన్ 7పై భారీ అంచనాలు పెంచేటట్టు చేసింది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సీజన్ ఉంటుందని.పైగా నాగార్జున చెప్పిన డైలాగ్స్ తో కూడా ఈ సీజన్ మరింత హైలెట్ అవ్వనుందని తెలుస్తుంది.అయితే ఈ సందర్భంగా బిగ్ బాస్ షో గురించి మరొక వార్త బాగా వైరల్ అవుతుంది.
అదేంటంటే నాగర్జున రెమ్యూనరేషన్.
ఆయన చేసిన గత సీజన్ల కంటే ఈ సీజన్ కు కాస్త ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నట్లు తెలిసింది.ఇక వినిపిస్తున్న వార్త ప్రకారం ఈ సీజన్ కోసం నాగార్జున రూ.200 కోట్ల రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో జనాలు ఇంత రెమ్యూనరేషనా అని నోరెళ్ళబెడుతున్నారు.ఇది కదా నాగార్జున రేంజ్ అంటూ ఆయన అభిమానులు పొంగిపోతున్నారు.ఇక ఈ సీజన్ సెప్టెంబర్ నెల ఆఖరి వారంలో ప్రారంభం అవ్వనుందని తెలుస్తుంది.