జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నాలుగో రోజు కొనసాగుతోంది.ఇందులో భాగంగా గాజువాకలో పవన్ పర్యటనతో జనసేన అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.
వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వారాహి వాహనం వద్ద అభిమానులతో పాటు జనసైనికుల సెల్ఫీలు, డ్యాన్సులతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.
కాగా మరికాసేపటిలో గాజువాకలో వారాహి యాత్ర ప్రారంభంకానుంది.