అక్కినేని నాగచైతన్య ( Naga chaithanya ) మళ్లీ ప్రేమలో పడడం ఏంటి.అని మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ…మరి అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడ్డ ఆ వ్యక్తి ఎవరు? అసలు విషయం ఏంటి.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.నాగార్జున తండ్రి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూనే.మరోవైపు బిగ్ బాస్ ( Bigg boss ) రియాల్టీ షో కి హోస్టుగా కూడా వ్యవహరిస్తున్నారు.అంతేకాకుండా ఎంతోమంది కొత్త కొత్త దర్శకులకు, నిర్మాతలకు, నటీ నటులకు కూడా ఛాన్సులు ఇస్తూ మంచి పేరు సంపాదించారు.
అలాంటి నాగార్జున ( Nagarjuna ) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కొడుకు నాగచైతన్య ( Naga chaithanya ) ప్రేమలో పడ్డాడు అంటూ ఒక సీక్రెట్ ని అందరి ముందే బయట పెట్టారు.నాగార్జున ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
మా వాడి వాలకం ఈ మధ్యకాలంలో కాస్త డిఫరెంట్ గా మారుతుంది.

ఎప్పుడూ కూడా ఫోన్లోనే గడుపుతూ ఉన్నాడు.తిండి తినమన్నా కూడా వాడికి ధ్యాసే ఉండడం లేదు.ప్రతిసారి ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నాడు.
ఇక గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నాడు.అయితే ఇంట్లో ఉంటే మేము ప్రతిసారి వాడిని ఇబ్బంది పెడుతున్నామని వేరే ఫ్లాట్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు.
ఇక తిండి కూడా సరిగ్గా తినడం లేదు.అలాగే సినిమాల గురించి నేను ఎంత చెప్పినా కూడా సినిమాలపై దృష్టి సారించడం లేదు.
ఇక వాడి ప్రవర్తన మొత్తం గమనిస్తే ఎవరితోనూ డీప్ లవ్ లో ఉన్నట్టు నాకు అర్థం అవుతుంది.అయితే నీ ప్రవర్తనలో ఏదో మార్పు వస్తుంది.
అసలు విషయం ఏంటో చెప్పరా అంటే అలాంటిది ఏమీ లేదు నాన్న అంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.

కానీ వాడి బిహేవియర్ చూస్తే నాకు అర్థమైంది వాడు ఎవరితోనో గాఢమైన ప్రేమలో మునిగిపోయాడని అంటూ నాగార్జున ( Nagarjuna ) ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారు.అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో నాగచైతన్య మళ్ళీ ప్రేమలో పడ్డారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఏంటంటే.
నాగార్జున మాట్లాడిన మాటలు ఇప్పటివైతే కావు.గతంలో సమంత ( Samantha ) తో నాగచైతన్య పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయినప్పుడు నాగార్జున ( Nagarjuna ) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇవి.అయితే అప్పటి వీడియో తాజాగా నెట్టింట్లో మరోసారి వైరల్ అవ్వడంతో ఈ విషయం మరోసారి తెరపై వినిపిస్తోంది.