ఇప్పటి వరకు మీరు చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ తిని ఉంటారు.ఇక మన పొరుగు దేశం చైనాలో గబ్బిలాలు, ఎలుకలు, ఇతర జీవులను ఆహారంగా వండి తినేస్తుంటారు.
మన దేశంలో ఎవరూ ఇంత సాహసం చేయరు.అయితే ఇప్పటి వరకు మనిషి మాంసం తిన్న వారు ఎవరైనా ఉన్నారా అంటే నిస్సందేహంగా లేరు అనే చెబుతాం.
మృతదేహాలను అఘోరాలు తింటారనే ప్రచారం ఉన్నా అందులో వాస్తవం ఎంతో తెలియదు.అయితే బ్రిటన్‌కు( Britain ) చెందిన ఓ కంపెనీ అందరికీ షాక్ ఇచ్చింది.
మనిషి మాంసాన్ని పబ్లిక్‌గా విక్రయిస్తోంది.కిలోల చెప్పున అమ్మేస్తోంది.
తినడానికి వీలుగా ఉంటుందా అని చాలా మందికి సందేహం రావొచ్చు.అయితే ఇది చాలా రుచిగా ఉంటుందని, ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లలో మనిషి మాంసంతో తయారు చేసిన వంటకాలు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.
బ్రిటన్‌లోని ఛానల్ 4లో ఇటీవల ఓ వీడియో ప్రసారం అయింది.ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.‘గ్రెగ్ వాలెస్: ది బ్రిటీష్ మీట్ మిరాకిల్’ ( Greg Wallace: The British Meat Miracle )పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో గుడ్ హార్వెస్ట్( Good harvest ) అనే కంపెనీ తయారు చేసిన మానవ మాంసాన్ని గ్రెగ్ వాలెస్( Greg Wallace ) అనే ఇంగ్లిష్ న్యూస్ ప్రజెంటర్ తింటున్నట్లు ప్రదర్శించబడింది.‘మానవ కణజాలం నుంచి సేకరించిన సన్నని ముక్కల’ నుండి తయారైన ఈ ప్రత్యామ్నాయ ప్రోటీన్ మూలం వివిధ ఆహార ఉత్పత్తులుగా రూపాంతరం చెందగల మాంసమని ఈ షోలో పేర్కొన్నారు.
పోషకాలు అధికంగా ఉండే మిశ్రమాన్ని అందించగలదని, అంతేకాకుండా సాంప్రదాయ జంతు ప్రత్యామ్నాయాల కంటే ఈ మానవ మాంసం చాలా సరసమైనదని, ఇది మొత్తం కుటుంబాలను పోషించడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారం అని ప్రదర్శనలో పేర్కొన్నారు.ప్రదర్శన సమయంలో, వాలెస్ లింకన్‌షైర్‌లోని ( Wallace in Lincolnshire )ఒక కాల్పనిక మానవ మాంసం హార్వెస్టింగ్ ప్లాంట్‌ను సందర్శిస్తున్నట్లు చూపబడింది.
అక్కడ అతను దాతలుగా భావించే కొందరిని కలుసుకున్నాడు.యురోపియన్ యూనియన్ చట్టం ప్రకారం, అటువంటి యంత్రాలను జంతువుల మాంసం కోసం ఉపయోగించలేమని, అయితే ఇప్పుడు మానవ మాంసాన్ని కోయడానికి ఉపయోగించవచ్చని, దాతలకు వారి మాంసానికి పరిహారం చెల్లించబడుతుందని అతను వివరించాడు.ఇది చూసిన వీక్షకులంతా భయపడ్డారు.అయితే ఇది కేవలం వ్యంగ్యపూరిత వీడియో అని తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు.