బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం మూడవ వారం పూర్తి చేసుకుంది ఇక వీకెండ్ లో భాగంగా నాగార్జున వేదిక పైకి వచ్చి హౌస్ మేక్స్ తో మాట్లాడటమే కాకుండా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఈ వారం ఎవరు ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు ఎవరు తప్పుగా వ్యవహరిస్తున్నారు ఎవరు ఆట సరిగా ఆడటం లేదు అనే విషయాలన్నింటినీ బయట పెడుతూ హౌస్ మెట్లకు భారీగానే క్లాస్ పీకారు అని తెలుస్తుంది.ముఖ్యంగా సీరియల్ ఆర్టిస్టులు అందరికీ కూడా నాగార్జున( Nagarjuna ) బాగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి ఇక ఆట సందీప్ పై కూడా నాగ్ ఫైర్ అయ్యారు.
మూడవ హౌస్ మేడ్ కి సంబంధించి పవర్ అస్త్రా కోసం జరిగిన పోటీలకు సంబంధించి ఆట సందీప్ ( Sandeep ) ను సంచాలక్ గా వ్యవహరించారు.నువ్వు సరిగా సంచాలక్ గా వ్యవహరించలేదని నాగార్జున మండిపడ్డారు.ఎంపైర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఆటలోకి ఇన్వాల్వ్ కారు కానీ నువ్వు మధ్య మధ్యలో ఎందుకు పాయింట్స్ ఇస్తున్నావు.నువ్వు సంచాలక్ గా ఆడావా లేక పర్సనల్గా ఆడవా అంటూ నాగార్జున నిలదీయడంతో ఆట సందీప్ కాస్త కన్ఫ్యుజ్ అయ్యాను సర్ అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.
ఎంపైర్ కన్ఫ్యూజన్ అయితే ఆట ఆడరు కదా అని నాగార్జున( Nagarjuna ) చెప్పడంతో ఈ ప్రశ్నకు సందీప్ నుంచి ఏ విధమైనటువంటి సమాధానం రాలేదు.
మొదట అనౌన్స్ మెంట్‌లో సంచాలక్ అని చెప్పలేదని ఆట సందీప్ ( Sandeep )అని చెప్పగా, నువ్వు కంటెండర్ కాదు, మరి ఎందుకు పిలుస్తారు? నువ్వు పెద్ద పిస్తా అనా? అంటూ ఫైర్ అయ్యాడు నాగ్.దీంతో సందీప్‌కి నోట మాట రాలేదు.ఇక ఈయన సరిగా సంచాలక్ గా వ్యవహరించలేదు అన్నవారు చేతులు పైకి ఎత్తమని చెప్పగా ఐదు మంది చేతులు పైకెత్తారు.
దీంతో గ్రీన్ లో ఉన్నటువంటి ఈయన బ్యాటరీ తగ్గించడంతో ఎల్లోకి వెళ్లిపోయారు.వీకెండ్ మాత్రం నాగర్జున హౌస్ మెట్లకు తన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చారని స్పష్టంగా అర్థమవుతుంది.