తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు( Balayya Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈయన సాధించిన విజయాలు అలాంటివి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిలో బాలయ్య బాబు ముందు వరుసలో ఉంటాడనే చెప్పాలి.ఇక సీనియర్ హీరోలలో అయితే వరుసగా మూడు సినిమాలతో 100 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…
ఇక ఈ సినిమాతో వరుసగా నాలుగోవ హిట్ కొట్టడానికి రెఢీ అవుతున్నాడు… అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ బాలయ్య బాబుకు సంబంధించిన ఒక వార్త చాలా రోజుల నెట్ లో తెగ హల్చల్ అవుతుంది.అది ఏంటి అంటే అప్పట్లో బాలయ్య బాబు హీరో గా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో చేసిన కృష్ణ బాబు సినిమాలో( Krishna Babu Movie ) మొదటగా బాలయ్య బాబుని హీరో గా అనుకోలేదంట మొదట నాగార్జున( Nagarjuna )తో ఈ సినిమా చేద్దామని డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అనుకున్నప్పటికీ అది నాగార్జునతో వర్కౌట్ అవ్వక బాలయ్య బాబు దగ్గరికి వచ్చింది.
ఇక బాలయ్య బాబు ఈ సినిమా చేసి తన ఖాతాలో భారీ డిజాస్టర్ ని వేసుకున్నాడు… నిజానికి నాగార్జున( Nagarjuna ) చేయాల్సిన ఈ సినిమాలోకి బాలయ్య బాబు ఎలా వచ్చాడు అనేది అప్పుడు ఆశ్చర్యం కలిగించింది.ఇక నాగార్జున రిజెక్ట్ చేసిన కథని చేసి బాలయ్య బాబు ఒక భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేశాడు.నాగార్జున తెలివి గా ఆ ప్లాప్ నుంచి తప్పించుకుంటే బాలయ్య మాత్రం ఆ ప్లాప్ కి బలి అయిపోయాడు…ఇక ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో బాలయ్య మరో సినిమా చేయలేదు.ఇక బాలయ్య అప్పటి నుంచి స్టోరీ లా విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు…