గతంలో పవన్ కళ్యాణ్ ని పొగిడిన వీడియో షేర్ చేసిన నాగబాబు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఈ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి గత రెండు రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గురించి తీవ్ర విమర్శలు చేశారు.

 Pawan Kalyan, Posani Murali Krishna, Naga Babu, Andhra Pradesh,instagram,sicial-TeluguStop.com

ఈ క్రమంలోనే పోసాని వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు స్పందించారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ అంటూ నాగబాబు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా వీడియోలు, ఎమోజీల ద్వారా సమాధానాలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఓ అభిమాని తిరిగి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా అని అడగగా అందుకు నాగబాబు ఇంట్రెస్ట్ పోయింది అంటూ ఒక ఎమోజి షేర్ చేశారు.ఈ క్రమంలోనే మరొక నెటిజన్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు అన్న అని అడగడంతో.

గతంలో పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ చేసినటువంటి వీడియోను షేర్ చేశారు.

Telugu Andhra Pradesh, Naga Babu, Pawan Kalyan, Posanimurali-Movie

ఈ వీడియోలో పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ సినిమాలలో యాక్ట్ చేస్తానంటే నేను బ్లాంక్ చెక్ ఇస్తాను దానిపై ఎన్ని సున్నాలు అయినా పెట్టుకోవచ్చు కేవలం నాకు డేట్స్ ఇస్తే చాలు అంటూ అంత డిమాండ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ ఈయన తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియాలోనే టాప్ హీరో.పవన్ కళ్యాణ్ ఐదు, పది కోట్లకు లంగా పనులు చేయడు అంటూ పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉన్నటువంటి వీడియోను షేర్ చేశారు.ఈ క్రమంలోనే మరొక నెటిజన్ ఏపీ ప్రభుత్వం మూవీ టికెట్స్ పై తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా…విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం రవితేజ దొంగతనం చేస్తూ వాటాలు పంచుకున్నటువంటి వీడియోను షేర్ చేశారు.

ఇలా నాగబాబు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం తప్పులేదని పరోక్షంగా తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube