సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో నాగ శౌర్య( Naga shourya ) ఒకరు ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమా లు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి ఇక రీసెంట్ గా వచ్చిన రంగబలి సినిమా కూడా ప్లాప్ అయింది అయితే ఎందుకు నాగ శౌర్య సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అని ఆరాతీస్తే కొంత మంది సిని మేధావులు చెప్పిన విషయం ఏంటంటే ఏంటంటే నాగ శౌర్య స్టోరీలలో కొంచం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాడని తెలుస్తుంది…
డైరెక్టర్లు ఆయనకి చెప్పిన స్క్రిప్ట్ ని చాలా వరకు నాగ శౌర్య మారుస్తాడనే టాక్ ఇండస్ట్రీ లో చాలా గట్టిగానే వినిపిస్తుంది.ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఇలానే తను ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడని తెలుస్తుంది ఇక దీని విషయం గానే డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) తో కూడా చాలా వరకు గొడవలు జరిగినట్టు గా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి…ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న ఆయన తో సినిమా చేసే ప్రతి డైరెక్టర్ విషయం లో కానీ ప్రతి స్టోరీ విషయం లో కానీ ఇలానే చేస్తాడు అని చాలా మంది చెప్తూ ఉంటారు…నిజానికి ఈయన చేసిన చాలా సినిమాల డైరెక్టర్లు మంచి డైరెక్టర్లు అయిన కూడా ఈయన దగ్గరికి వచ్చాకే ఎందుకు సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు…
ఇక రీసెంట్ గా వచ్చిన రంగబలి సినిమా ( Rangabali Movie )కూడా మంచి విజయం సాధించాల్సింది.కానీ ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీ ని కంప్లీట్ గా మనోడు మార్చేశాడు అని బయట టాక్ అయితే నడుస్తుంది.ఇలా చేయడం వల్ల ఆయనకి ఏం వస్తుంది అని మరి కొంత మంది అంటున్నారు…ఆయనకి హిట్ పడాలంటే డైరెక్టర్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే ఆయన ఒక మంచి సినిమా చేయగలడు అంతే కానీ ఈయనకి నచ్చినట్టు గా స్టోరీ ని మార్చితే ఎందుకు సినిమా అనేది సక్సెస్ అవుతుంది అనేది క్లారిటీ గా తెలుసుకుంటే మంచిది…
ఇక ఈయనే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న మరికొంత మంది యంగ్ హీరోలు కూడా ఇలానే చేస్తున్నారు అని తెలుస్తుంది.అలా కాకుండా ఒకసారి వాళ్ళు చేసే సినిమాల పద్ధతిని మార్చుకుంటే మంచిది.ఎందుకంటే ఒక డైరెక్టర్ తన కెరియర్ మొత్తం సినిమా కోసమే త్యాగం చేసి ఎదురుచూస్తుంటే ఇక వీళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ల సినిమా ప్లాప్ అయితే వాళ్ళకి ఇంకో సినిమా ఇచ్చే హీరో దొరకడం కష్టం అవుతుంది…
.