Nabha Natesh : కిల్లింగ్ లుక్ తో నభా నటేష్ రచ్చ.. ఏంటి ఈ అడుక్కుతినే అవతారమంటూ దారుణమైన కామెంట్స్?

అవకాశాల కోసం చిన్న హీరోయిన్స్ పడే ఆరాటం మామూలుగా ఉండదని చెప్పాలి.కెరీర్ పరంగా ముందుకు వెళ్లాలని పదిమందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని బాగా తపన పడుతూ ఉన్నారు.

 Nabha Natesh With A Killing Look What Are The Outrageous Comments About This Be-TeluguStop.com

ఎప్పటికప్పుడు దర్శక నిర్మాతలను మెప్పించడానికి తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతూనే ఉన్నారు.ప్రస్తుతం చిన్న హీరోయిన్స్ పయనం మొత్తం గ్లామర్ వైపే అని చెప్పాలి.

అందులో ఒకరు హాట్ బ్యూటీ నభా నటేష్( Nabha Natesh )తాజాగా ఈ బ్యూటీ హాట్ ఫోటోలను వదలగా నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారుటాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ నభా నటేష్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ అని చెప్పాలి.చేసింది కొన్ని సినిమాలే.

అయినప్పటికీ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంది.నటన పరంగా కూడా బాగానే మార్కులు సంపాదించుకుంది కానీ.

ఎందుకో అంత అవకాశాలు అందుకోవటం లేదు.ఈ బ్యూటీ తొలిసారిగా 2015 కన్నడం లో వజ్రకాయ( Vajrakaya ) అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయమైంది.అలా కొంతవరకు నటనపరంగా మార్కులు సంపాదించుకుంది.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా అందరిని బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించగా అంతగా ఆ సినిమా సక్సెస్ కాలేక పోయింది.

ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ అవకాశాల కోసం, మంచి సక్సెస్ కోసం బాగా కష్టపడుతుంది.

ఇక సోషల్ మీడియా( Social media )లో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.ఫిట్ గా ఉండటం కోసం బాగా వర్క్ అవుట్ లు చేస్తుంది.హాట్ హాట్ లుక్ లతో పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి దృష్టిలో పడుతుంది.

కానీ దర్శక నిర్మాతల దృష్టిలో మాత్రం పడలేక పోతుంది.దీంతో జనాలు సైతం ఈమె పై బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.మంచి టాలెంట్ ఉన్నా కూడా ఈమెను నిజంగానే పట్టించుకోవడం లేదు దర్శకులు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్స్టాలో కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో స్టైలిష్ లుక్ లో కనిపించింది.పైగా కెమెరాకు రకరకాల ఫోజులు కూడా ఇచ్చింది.

ఇక తన కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది.చూడటానికి ఆ ఫోటోలలో తను చాలా అందంగా కనిపించింది.

అయితే ఆ ఫోటోలు చూసిన తన అభిమానులు తనకు అవకాశాలు ఇవ్వమని దర్శక నిర్మాతలను కోరుతున్నారు.

కానీ మరి కొంతమంది ఎప్పటిలాగే ట్రోల్స్ చేస్తున్నారు.

నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీకు అవకాశాలు రావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏంటి ఈ అడుక్కుతినే అవతారం అంటూ ఒక నెటిజన్ దారుణంగా కామెంట్ చేశారు.

ఇక ఆ కామెంట్లతో పాటు తన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.ఇక రీసెంట్ గానే ఒక సినిమాలో అవకాశం అందుకుందని తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube