స్టేషన్ ఘన్పూర్ లో రాజయ్య ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా..?

కెసిఆర్ ( KCR ) సారథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.మూడోసారి కూడా ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని, హ్యాట్రిక్ కొట్టాలని అనేక వ్యూహాలను రచిస్తోంది.

 Will Rajaiah Contest As An Independent In Station Ghanpur, Cm Kcr, Tatikonda R-TeluguStop.com

నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించి సంచలనం క్రియేట్ చేసింది.అయితే ఈసారి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చి అదరహో అనిపించింది.

కానీ ఆ ఏడు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను మార్చారు.దీంతో అసమ్మతి రాగం పెరుగుతోంది.

అయితే తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ( Tatikonda Rajaiah ) పేరు కూడా కెసిఆర్ ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల లిస్టులో లేదు.

Telugu Candi, Kadiyam Srihari, Ghanpur, Telangana-Politics

దీంతో ఆ నియోజకవర్గ వ్యాప్తంగా రాజయ్య అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు.రాజయ్యను కలిసి ఆయన మీద పడి ఏడ్చారు.ఆ బాధను తట్టుకోలేక రాజయ్య కూడా భావోద్వేగానికి గురయ్యారు.

అయితే ఆ సీటును కడియం శ్రీహరి ( Kadiyam Srihari ) కి కేటాయించారు.ఈ తరుణంలోనే రాజయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ.

నాకు సీటు కేటాయించకున్నా పర్లేదు పార్టీ హద్దులు దాటను, మరో పార్టీకి వెళ్ళేది లేదు, కెసిఆర్ వెంటే నేను ఉంటాను అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేస్తూ కార్యకర్తలను పట్టుకొని బోరున విలపించారు.

అయితే రాజయ్య మాత్రం కెసిఆర్ గీసిన గీతను దాటకుండా ఆదేశాలు పాటిస్తాను అంటున్నారు కానీ, ఆయన అభిమానులంతా మా రాజన్నే మాకు కావాలి అంటూ ఏడుస్తూ నినదిస్తున్నారు.రాజన్న కి టికెట్ కేటాయించాలని కేసీఆర్ ( Kcr ) ను అడుగుతున్నారు.

Telugu Candi, Kadiyam Srihari, Ghanpur, Telangana-Politics

చివరి వరకు కూడా మా రాజన్నకు ఎలాంటి టికెట్ ఇవ్వకపోతే మాత్రం మా రాజన్నను ఎలాగైనా మేము ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేయించుకొని మరీ గెలిపించుకుంటాము అనే విధంగా మాట్లాడుతున్నారు.మరి చివరి సమయం వరకైనా రాజయ్య పోటీ చేస్తారా లేదంటే కేసీఆర్ కోసం కట్టుబడి ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube