ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ) రాజకుమారుడు అనే మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన తండ్రి కృష్ణ ( Krishna ) స్టార్ హీరో అవ్వడంతో సినీ బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల ఈయనను చాలా మంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకున్నారు.
అలా అప్పట్లో యమలీల సినిమా తీసిన ఎస్వి కృష్ణారెడ్డి కూడా కృష్ణ గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల యమలీల సినిమాలో మహేష్ బాబుని పెట్టుకుందాం అనుకున్నారు.కానీ ఇందులో కామెడీ రోల్ ఉండడం వల్ల ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైతే తన కొడుకుకి అంతగా ఇమేజ్ రాదు అనే ఉద్దేశంతో ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాను రిజెక్ట్ చేశారు కృష్ణ.
అలా రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు.అయితే ఇప్పటివరకు మహేష్ బాబు సినీ కెరియర్ లో ఎన్నో హిట్టులు ప్లాఫ్ లు ఉన్నప్పటికీ ఆ ఒక్క సినిమా మాత్రం మహేష్ బాబు కెరియర్ లో పెద్ద దెబ్బ కొట్టిందట ఇక ఆ సినిమా ఏదో కాదు బ్రహ్మోత్సవం.ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ( Srikanth addala ) అప్పటికే మహేష్ బాబుకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాతో మంచి హిట్ ఇవ్వడంతో ఆయన మీద ఉన్న నమ్మకంతో బ్రహ్మోత్సవం సినిమాకి ఒకే చెప్పారట.
కానీ తీరా ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యాక పెద్ద డిజాస్టర్ అయింది.దాంతో చాలామంది మహేష్ బాబు అంటే పడని ఇతర హీరోల అభిమానులు మహేష్ బాబు ని ఓ రేంజ్ లో ఏకిపారేశారు.ఇక ఈ రిజల్ట్ చూసి మహేష్ బాబు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారట.
అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మహేష్ బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.నా కర్మ కాలి ఈ సినిమా చేశాను.అంతా నా కర్మ.అసలు బ్రహ్మోత్సవం ( Brahmothsavam ) సినిమా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇక అప్పటి మాటలు ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా కోసం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.