అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5 లాంటి ప్రముఖ ఓటీటీలకు ఆహా ఓటీటీ గట్టి పోటీని ఇస్తున్న సంగతి తెలిసిందే.గతేడాది ఆహా కోసం సమంత సామ్ జామ్ షో చేయగా ఈ ఏడాది అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో బాలయ్య హోస్ట్ గా టాక్ షో ప్రసారం కానుంది.
తొలి ఎపిసోడ్ కు మోహన్ బాబు అతిథిగా హాజరు కాగా మంచు విష్ణు, మంచు లక్ష్మి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.అయితే ఈ షో ద్వారా మోహన్ బాబు తన సినీ కెరీర్ లో తనకు నచ్చని సినిమా గురించి చెప్పుకొచ్చారు.
బాలయ్య తొలిసారి టాక్ షోకు హోస్ట్ గా చేస్తుండటంతో ఈ షో కోసం సాధారణ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.బాలయ్య మోహన్ బాబుకు చాదస్తం అని ఇంట్రడక్షన్ కూడా కాకుండానే వచ్చేస్తారని చెప్పుకొచ్చారు.
బాలయ్య తన వయస్సు గురించి మాట్లాడుతూ 16 అని చెప్పుకొచ్చారు.ప్రోమోలో మీరు యాక్ట్ చేసిన సినిమాలలో అస్సలు చూసుకోలేని సినిమా ఏదంటూ బాలయ్య మోహన్ బాబును ప్రశ్నించారు.
పటాలం పాండు అనే సినిమా తన కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమా అని మోహన్ బాబు పరోక్షంగా వెల్లడించారు.
ప్రోమోలో బాలకృష్ణ వివాదాస్పద ప్రశ్నలను కూడా టచ్ చేశారు.మరోవైపు మోహన్ బాబు ఈ షోలో ఎమోషనల్ అయ్యారు.హీరోగా నిలబడాలని ప్రయత్నించిన ప్రయత్నాలు విఫలమైన సమయంలో బాధ పడ్డారా? అని బాలయ్య ప్రశ్నించగా తలచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
తాను నివశిస్తున్న ఇంటిని అమ్మేశానని బిడ్డలను మోసం చేస్తున్నానని తనకు అనిపించిందని మోహన్ బాబు పేర్కొన్నారు.మంచు లక్ష్మీ ఈ మధ్య అబద్ధాలు చెబుతోందని విష్ణు అబద్ధాలు చెప్పడని మోహన్ బాబు అన్నారు.ఈ షో కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.