ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ రూ.80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్న బిజెపి ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాలు మోపి అంబానీ, ఆధానీల ఆస్తులను పెంచుతున్న మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసి విస్మరించిన మోడీ ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు జమ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ఎనిమిది ఏళ్ళు కావస్తున్న 8 పైసలు జమ చేయకుండా ప్రజలను మోసం చేసింది.పేదలపై పన్నుల భారాన్ని మోపి.కార్పొరేట్లకు, సంపన్నులకు రాయితీలు ఇస్తున్న మోడీ ప్రభుత్వం మనకు అవసరమా?
ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన సీఎం కేసీఆర్ఎనిమిదేళ్ల కాలంలో రూ.ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల పై భారం మోపుతున్న సీఎం కేసీఆర్,ప్రజలను మోసం చేయడంలో మోడీ, కేసీఆర్ దొందూ దొందే.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ వంద శాతం అమలు చేస్తాం ఏక కాలంలో రెండు లక్షలు రుణ మాఫీ చేసి రైతులను ఆదుకుంటాంవరి ధాన్యానికి మద్దతు ధర పై వెయ్యి రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తాం.
కాంగ్రెస్ తోనే తెలంగాణలో రైతు రాజ్యం సాధ్యం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన వత్తిడి తీసుకురావడానికి ఎండను సైతం లెక్కచేయకుండా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సమస్యలపై పాదయాత్రలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారం కోసం ప్రభుత్వం మీద వత్తిడి తెస్తాను.ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా.