కృష్ణాజిల్లా: గన్నవరం మండలం బొమ్ములూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.పాల్గొన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ.ఎమ్మెల్యే వంశీ కామెంట్స్.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు అమలు తీరుకు వైసీపీ మద్దతు తెలిపాను.
సచివాలయ, వాలంటీర్లు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది.గ్రామంలో ప్రతి ఒక్క లబ్ధిదారులను వాలంటీర్లు గుర్తిస్తున్నారు.
ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే చేరుతున్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నేరుగా లబ్ధిదారులను కలవడం జరుగుతుంది.
గ్రామాల్లో ప్రజల నుండి స్పందన బాగుంది.ప్రజల నుండి వచ్చిన వినతులను వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం.
నిన్న సీఎంఓ కార్యాలయం నుండి పిలుపు రావడంతో వెళ్ళాను.సీఎంఓ కార్యాలయంలో అధికారులు బిజీగా ఉండడం చేత నాతో ఏమి మాట్లాడలేదు.
సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన అనంతరం మళ్ళీ కలుద్దాం అన్నారు.ఎవరి సమస్య వాళ్ళే తీర్చుకోవాలి,నాకు అయితే ఏ సమస్య లేదు.
మూడు ఎన్నికలు నేరుగా ప్రజలతో పనిచేసిన వ్యక్తిని.విడత ఊపులకు,తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు.
ప్రజలకు మంచి చేసే విధంగా పనిచేయాలి.
అంతేగాని పనిచేసే వ్యక్తి పై బైక్ ర్యాలీలు, బస్సు ర్యాలీలు పెడితే వచ్చే ఉపయోగం ఏమిటి? గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా పని చేస్తే బాగుంటుంది.సినిమా తరహా బైక్,బస్సు ర్యాలీలు నేను సినిమా తీసిన టైం లొనే చూసాను.ఎవరి ఉద్దేశ్యం, మనో భావాలు ప్రకారం పనిచేసుకోవచ్చు.నిన్న నియోజకవర్గ పరిధిలోని కొన్ని సమస్యల పై సీఎంఓ చర్చించి వచ్చాను.తొందరలో ఊళ్ళో ఉండేవాడు ఎవరో పోయే వాళ్ళు ఎవరో చూస్తారు.16 ఏళ్ల నుండి గన్నవరంలొనే రాజకీయాలు చేస్తున్నా.విజయవాడ ఎంపీగా పోటీ చేసినా నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు వదిలి వెళ్ళలేదు.