విజయవాడ: అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవి నగర్ లో స్థానికులు సిసి కెమెరాలు ఎర్పాటు చేసారు.కొత్తగా ఎర్పాటు చేసిన 34 సీసీ కెమెరాలను నగర పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా సెంట్రల్ MLA మల్లాది విష్ణు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మట్లాడుతు.విజయవాడను దేశం లోని అన్ని నగరాలకన్న ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళడానికి సహకరిస్తానని తెలిపారు.
నేరాల నియంత్రణకు వాటిని అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సిపి తెలిపారు.మహిళ మిత్ర, మహిళ పోలీసులు, పోలీసులలో ఒక బాగం కావాలన్నారు.విజయవాడ నగరంలోనున్న పోలీస్ స్టేషన్లో, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభించామని మిగిలిన కాలనీ సెంటర్లలో కూడా ఎర్పాటు చేస్తామన్న స్థానిక mla మల్లాది విష్ణు తెలిపారు.
పోలీసు కమిషన్ రానాకు నగర ప్రజలకు చేరువ అయ్యారని దాతల సహాయంతో ఈ సీసీ కెమెరాల ఎర్పాటు చేయడం జరిగిందని వారికి ధన్యవాదాలు తెలిపారు.
త్వరలో గుణదల పోలీస్ స్టేషన్ ను కూడా ప్రారంభిస్తామన్నారు.