'ఆదిపురుష్' వసూళ్లను దాటేసిన 'మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి'..పరువు పోయిందిగా!

'Miss Shetty..Mr. Polishetty' Who Surpassed The Collections Of 'Adipurush'..the Reputation Is Gone , Prabhas , Miss Shetty Mr Polishetty , Bro , AnushkaShetty ,Naveen Polishetty ,Adipurush , Tollywood

ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలను చిన్న సినిమాలు ఒక రేంజ్ లో డామినేట్ చేసాయి అని చెప్పొచ్చు.భారీ అంచయాణాల నడుమ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడితే, గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం కాసుల కనకవర్షం కురిపించాయి.

 'miss Shetty..mr. Polishetty' Who Surpassed The Collections Of 'adipurush'..the-TeluguStop.com

అలాంటి చిత్రాలలో ఒకటి నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క శెట్టి ( AnushkaShetty )కాంబినేషన్ లో వచ్చిన ‘మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి’ ( Miss Shetty Mr Polishetty )అనే చిత్రం.

విడుదలకు ముందు ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు.పాటలు, టీజర్ మరియు ట్రైలర్ ఇలా ఏది కూడా ఈ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది.కానీ నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) అద్భుతమైన కామెడీ టైమింగ్ జనాలను బాగా ఎంటర్టైన్ చేసింది.

ఫలితంగా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Telugu @anushkashetty, Adipurush, Prabhas, Tollywood-Movie

ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు పెద్ద హీరోల సినిమాలకు కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.గత వారం లో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ అమెరికా ఫుల్ రన్ గ్రాస్ ని దాటేసింది.ఈ వారానికి కరెక్ట్ గా 17 లక్షల డాలర్స్ ని రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో రెండు మిలియన్ డాలర్లను రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరో గా నటించిన ఆదిపురుష్ చిత్రం( Adipurush ) నార్త్ అమెరికా లో 19 లక్షల డాలర్లు వసూలు చేసింది.నేటితో ఆ వసూళ్లను దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

సరైన కంటెంట్ ఇస్తే స్టార్ స్టేటస్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తాయి అనడానికి నిదర్శనం గా నిల్చింది ఈ చిత్రం.

Telugu @anushkashetty, Adipurush, Prabhas, Tollywood-Movie

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతం లో దాదాపుగా క్లోసింగ్ పడినట్టే, కానీ ఓవర్సీస్ లో మాత్రం డ్రీం రన్ మరో రెండు వారాలు కొనసాగే అవకాశం ఉందట.నవీన్ పోలిశెట్టి >( Naveen Polishetty )కి వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ రావడం, ఆయన కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.ఫుల్ రన్ లో ఈ సినిమా 23 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ వారం కూడా పెద్దగా కొత్త సినిమాలేవీ విడుదల కాకపోవడం తో ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రావడానికి హెల్ప్ అయ్యిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube