స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty ) చాలా ఏళ్ల తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అనే చెప్పాలి.బాహుబలి తర్వాత ఈమె చాలా వరకు ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
ఈ సినిమా తర్వాత ఇన్నేళ్ళలో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది.దీంతో ఈమె ఇక సినిమాలు చేయదు అని ఫేడ్ అవుట్ అయిపోయింది అంటూ తెగ కామెంట్స్ వచ్చాయి.
కానీ ఇప్పుడు ‘‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాతో అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ అదిరిపోయే కంబ్యాక్ తో దూసుకు వచ్చింది.అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ( Miss Shetty Mr Polishetty ).ఇది సెప్టెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
అదే రోజు షారుఖ్ నటించిన జవాన్( Jawan movie ) కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమా జవాన్ ముందు తేలిపోతుంది అని అంతా అనుకున్నారు.కానీ అలా జరగలేదు.
ఈ సినిమా స్లోగా స్లో పాయిజన్ లా ఆడియెన్స్ కు ఎక్కడంతో రోజులు గడిచే కొద్దీ కలెక్షన్స్ పెంచుకుంటూ వచ్చింది.మొత్తానికి ఈ సినిమా 16 రోజుల్లో 50 కోట్ల క్లబ్ లో చేరిపోయినట్టు తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే 23 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా మిగిలిన భాషల్లో, ఓవర్సీస్ లో కలిపి 50 కోట్లకు పైగానే రాబట్టినట్టు తెలుస్తుంది.ఈ విజయానికి అనుష్కతో పాటు నవీన్ కూడా ప్రధాన కారణం.
మొత్తానికి జవాన్ వంటి భారీ సినిమా ముందు తట్టుకుని నిలబడడమే కాకుండా 50 కోట్లు కూడా రాబట్టడం గ్రేట్ అంటున్నారు.